మొక్కల రక్షణకు చర్యలు తీసుకోండి
ఇబ్రహీంపట్నం: ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో నర్సరీల్లోని మొక్కలను జాగ్రత్తగా సంరక్షించాలని, ఇందుకు అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని డీఆర్‌డీఏ ప్లాంటేషన్ సూపర్‌వైజర్ సక్కుబాయి సూచించారు. మంగళవారం ముకునూర్ గ్రామ పంచాయతీని సందర్శించిన ఆమె మొక్కలను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. రోజురోజుకు ఎండాల తీవ్రత పెరుగుతున్నందున నర్సరీల్లో పనిచేసే సిబ్బంది తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఉదయం, సాయంత్రం విధిగా నీళ్లు పట్టాలని సూచించారు. ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా లక్షలాది రూపాయలు ఖర్చు చేసిన పెంచుతున్న మొక్కలు ఎండిపోయే ప్రమాదం ఉందన్నారు. ఆమె వెంట గ్రామ పంచాయతీ కార్యదర్శి రాజ్‌కుమార్, ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ లింగం, నర్సరీ సంరక్షకుడు రాములు ఉన్నారు.
డీఆర్‌డీఏ ప్లాంటేషన్ సూపర్‌వైజర్ సక్కుబాయి
ముకునూర్ నర్సరీలో మొక్కల పరిశీలన
Comments
Please login to add a commentAdd a comment