కందుకూరు: ఆమనగల్లులో నిర్వహిస్తున్న రైతు దీక్ష కార్యక్రమానికి వెళ్తున్న బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో పాటు స్థానిక ఎమ్మెల్యే సబితారెడ్డికి మంగళవారం మండల కేంద్రంలో బీఆర్‌ఎస్ శ్రేణులు భారీఎత్తున స్వాగతం పలికారు. భారీ గజమాలతో సత్కరించి జేసీబీ యంత్రాలతో గులాబీ పూలను చల్లి తమ అభిమానాన్ని చాటుకున్నారు. కందుకూరు చౌరస్తాతో పాటు దెబ్బడగూడ గేట్ వద్ద పార్టీ జెండాను కేటీఆర్ ఆవిష్కంచారు. అనంతరం ఆయన వెంట రైతుదీక్షకు తరలివెళ్లారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు మన్నే జయేందర్‌ముదిరాజ్, వర్కింగ్ ప్రెసిడెంట్ మేఘనాథ్‌రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఎస్.సురేందర్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ డి.చంద్రశేఖర్, బీఆర్‌ఎస్ నియోజకవర్గ ఉపాధ్యక్షులు జి.లక్ష్మినర్సింహారెడ్డి, గణేశ్‌రెడ్డి, కార్యదర్శి మహేందర్‌రెడ్డి, మాజీ ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
దొంగల చేతివాటం
కందుకూరు చౌరస్తాలో కేటీఆర్‌కు స్వాగతం పలికే పనుల్లో నాయకులు బిజీగా ఉండటంతో ఇదే అదనుగా దొంగలు తమ చేతి వాటాన్ని ప్రదర్శించారు. మురళీనగర్ గ్రామానికి చెందిన బాల్‌రాజ్ జేబులో నుంచి రూ.25 వేలు తస్కరించారు. దీంతో అతను కార్యక్రమం అయిన తర్వాత చూసుకొని లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించాడు.
తుక్కుగూడ ఔటర్ వద్ద..
తుక్కుగూడ: ఆమనగల్లులో మంగళవారం చేపట్టిన రైతు దీక్ష కార్యక్రమానికి వెళ్తున్న బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు తుక్కుగూడ ఔటర్ వద్ద బీఆర్‌ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో ఆ పార్టీ మున్సిపల్ అధ్యక్షుడు జల్లాల లక్ష్మయ్యయాదవ్, మాజీ కౌన్సిలర్ రవినాయక్, సుమన్, లావణ్య, నాయకులు తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment