అభివృద్ధి పనుల్లో నాణ్యత పాటించాలి
మన్సూరాబాద్: డివిజన్‌లో జరిగే అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని కార్పొరేటర్ కొప్పుల నర్సింహారెడ్డి సూచించారు. హయత్‌నగర్ పరిధి కొలను శివారరెడ్డినగర్ కాలనీలో నూతనంగా చేపడుతున్న భూగర్భ డ్రైనేజీ పనులను మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ.. భవిష్యత్‌లో ఇబ్బందులు తలెత్తకుండా డ్రైనేజీ లెవల్స్ కచ్చితంగా పాటించాలన్నారు. కాలనీవాసులు అభివృద్ధి పనులను పర్యవేక్షించుకోవాలని కోరారు. కాలనీలో మిగిలి ఉన్న పనులకు నిధులు మంజూరు చేయించి పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కొలను నరేందర్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, యాదిరెడ్డి, మధుసూధన్, వెంకటేష్ నాయకులు పాతూరి శ్రీధర్‌గౌడ్, కడారి యాదగిరియాదవ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment