● చిన్నదైన ‘పెద్ద’ చెరువు
చెరువు కట్టపై వేసిన బండరాళ్లు
సుదీర్ఘకాలం పాటు నీటితో కళకళలాడిన కొత్తూరు మండలం ఇన్ముల్‌నర్వలోని పెద్ద చెరువు పూర్తిగా రియల్ వ్యాపారులు, మైనింగ్ నిర్వాహకుల కబంధ హస్తాల్లోకి వెళ్లింది. చెరువు శిఖంలో ఆక్రమణలతోపాటు స్టోన్‌క్రషర్ నిర్వాహకులు యథేచ్ఛగా రాళ్ల వ్యర్థాలు పారబోస్తు న్నారు. రికార్డుల్లో మాత్రమే చెరువు భద్రంగా ఉంది. క్షేత్రస్థాయిలో గుట్టలు, వెంచర్‌లోని ప్లాట్లు దర్శనమిస్తున్నాయి. అప్పట్లో మైనింగ్ వ్యాపారు లకు స్థానిక నాయకులు, కొందరు అధికారులు తోడవడంతో పది ఎకరాల్లో విస్తరించిన చెరువు ప్రస్తుతం ఐదెకరాలు కూడా లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా ఆయా శాఖల అధికారులు స్పందించి, చెరువును పరిరక్షించా లని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇదీ పరిస్థితి
ఇన్ముల్‌నర్వలో రెవెన్యూ రికార్డుల ప్రకారం సర్వే నంబర్ 254లో సుమారు 10.6 ఎకరాల్లో పెద్ద చెరువు విస్తరించి ఉంది. పదేళ్ల క్రితం చెరువు సమీపంలో ఏర్పాటైన ఓ గ్రానైట్ క్వారీ నిర్వాహ కులు మైనింగ్ అనంతరం వచ్చే బండరాళ్లను చెరువు కట్టతో పాటు చెరువులో పడేశారు. బండరాళ్లపై మట్టి పోసి తమ వాహనాల రాకపోకల కోసం చదును చేశారు. మరోవైపు సర్వే నంబర్లు 249, 250, 251లో చెరువు ఎఫ్‌టీఎల్ లెవల్‌లోనే ఓ భారీ వెంచర్ ఏర్పాటు చేశారు. ఏకంగా చెరువు శిఖంలోనే ప్లాట్ల రాళ్లను పాతారు. చెరువు ఆక్రమణలు, పూడ్చివేతలతో ఉనికిని కోల్పోతున్నప్ప టికీ అటు హెచ్‌ఎండీఏ, ఇటు ఇరిగేషన్ అధికారులు కనీస చర్యలు చేపట్టడం లేదు.
Comments
Please login to add a commentAdd a comment