పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత
నందిగామ: పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, విద్యార్థులకు చిన్నవయస్సులోనే పర్యావరణ స్పృహను పరిచయం చేయాలని కామన్‌వెల్త్ నేషన్స్ సెక్రటరీ జనరల్ పాట్రిసియా స్కాట్లాండ్ అన్నారు. మండల పరిధిలోని కన్హా శాంతి వనంలో హార్ట్‌ఫుల్‌నెస్ ఇన్‌స్టిట్యూట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘సస్టెనబిలిటీ ఇన్ క్లాస్ రూమ్’ కార్యక్రమం సోమ వారం రెండో రోజు కొనసాగింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన పాట్రిసియా స్కాట్లాండ్ కన్హాలోని హార్ట్‌ఫుల్ నెస్ ఇంటర్నేషనల్ స్కూల్‌ను సందర్శించిన అనంతరం మాట్లాడారు. ఆచరణాత్మక విధానంతో తరగతి గదులకు స్థిరత్వాన్ని తీసుకురావడంలో హార్ట్‌ఫుల్‌నెస్ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రత్యేక చొరవ తీసుకుంటోందని అభినందించారు. కార్యక్రమంలో ఇంటర్నేషనల్ స్కూల్ ప్రిన్సిపాల్ అన్నా రాజ్‌కుమార్, విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు.
కళ్లను జాగ్రత్తగా కాపాడుకోవాలి
షాద్‌నగర్: విద్యార్థుల కంటి పరిరక్షణకు వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టిందని జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారిణి షబా హయత్ అన్నారు. షాద్‌నగర్‌లోని ప్రభుత్వ కమ్యూనిటీ ఆస్పత్రిలో విద్యార్థులకు నిర్వహిస్తున్న కంటి పరీక్షల శిబిరాన్ని సోమవారం ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరి శరీర భాగంలో కళ్లు ఎంతో ప్రధానమైనవని అన్నారు. సున్నితమైన కళ్లను జాగ్రత్తగా కాపాడుకోవాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థుల కళ్లను కాపాడేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందని తెలిపారు. వచ్చే మార్చి, ఏప్రిల్ నెలల్లో వార్షిక పరీక్షలను దృష్టిలో పెట్టుకొని వైద్య ఆరోగ్య శాఖ ఆద్వర్యంలో కంటి వైద్య శిబిరాలు నిర్వహించనున్నట్టు చెప్పారు. పది రోజుల పాటు శిబిరాలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆమనగల్లు, శంషాబాద్, మహేశ్వరం నియోజకవర్గాలకు చెందిన విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ విజయలక్ష్మి, ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, హెల్త్ ఎడ్యుకేటర్ శ్రీనివాసులు, డాక్టర్ పుష్పలత, చంద్రశేఖర్, రమేష్, నరేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నేడు విద్యా విధానంపై బహిరంగ విచారణ
లక్డీకాపూల్: హైదరాబాద్ జిల్లాలో విద్యా విధానంపై తెలంగాణ విద్యా కమిషన్ బహిరంగ విచారణను నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఒక ప్రకటనలో తెలిపారు. స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవారం ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు రాష్ట్ర విద్యా కమిషన్ చైర్‌పర్సన్ ఆకునూరి మురళి ఆధ్వర్యంలో పబ్లిక్ హియరింగ్ జరుగుతుందన్నారు. కార్యక్రమా నికి సంబంధిత శాఖల అధికారులు విధిగా హాజరు కావాలని కలెక్టర్ పేర్కొన్నారు.
గ్రేటర్ ఇమేజ్‌ను పెంచుదాం
బంజారాహిల్స్: దేశవ్యాప్తంగా హైదరాబాద్ ఇమేజ్‌ను పెంచేందుకు నగరంలో సుందరీకరణ పనులను చేపట్టినట్లు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు. సోమవారం సాయంత్రం రోడ్డు నంబర్.45, షేక్‌పేట నాలా జంక్షన్ వద్ద మొత్తం రూ.49 లక్షల వ్యయంతో సుందరీకరించిన జంక్షన్లను మేయర్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లా డుతూ.. హైదరాబాద్‌కు పర్యాటక రంగంలో అంతర్జాతీయ నగరంగా గుర్తింపు ఉన్న నేపథ్యంలో ఇమేజ్‌ను మరింత పెంచాలనే ఉద్దేశంతో సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకు న్నట్టు తెలిపారు. నగరవ్యాప్తంగా రూ.150 కోట్ల అంచనా వ్యయంతో 106 ప్రదేశాల్లో పనులను చేపట్టే లక్ష్యంలో భాగంగా ఇప్పటివరకు 78 పనులను పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. షేక్‌పేట నాలా వద్ద రూ.24 లక్షల వ్యయంతో చేపట్టగా జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్.45 వద్ద చేపట్టిన సుందరీకరణ పనులకు రూ.25 లక్షల వ్యయంతో చేపట్టారని వివరించారు. కార్యక్ర మంలో జోనల్ కమిషనర్ అనురాగ్ జయంతి, డీసీ ప్రశాంతి, ఎస్‌ఈ రత్నాకర్, ఈఈ విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత
Comments
Please login to add a commentAdd a comment