
కీసరగుట్ట బ్రహ్మోత్సవాలకు నేడు అంకురార్పణ
కీసర: ప్రఖ్యాత శైవ క్షేత్రం కీసరగుట్ట శ్రీ భవానీ రామలింగేశ్వరస్వామి దేవస్థానంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. మార్చి 1వ తేదీ వరకు ఆరు రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. టీటీడీ వేద పాఠశాల ఆచార్యులు పుల్లేటికుర్తి గణపతి శర్మ ప్రధాన సంధానకర్తగా వైదిక కార్యక్రమాలు కొనసాగుతాయి. సోమ వారం ఉదయం 11 గంటలకు ఆలయ చైర్మన్ తటాకం నారాయణ దంపతులచే విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనం, రుత్విక్‌వరణం, యాగశాల ప్రవేశం, అఖండ జ్యోతి ప్రతిష్ఠాపనం తదితర కార్యక్రమాలను వైదికులు నిర్వ హిస్తారు. సాయంత్రం 4 గంటలకు అగ్ని ప్రతిష్ఠాపన, బేరిపూజ, ధ్వజారోహణ, ద్వాత్రింశతి రాగాలాపన, హారతి, రాత్రి 7 గంటలకు మంత్ర పుష్పం, పరాకస్తవం, తీర్థ ప్రసాద వినియోగం, రాత్రి 8 గంటలకు శ్రీస్వామివారిని కీసరగుట్ట నుంచి కీసర గ్రామానికి ఊరేగింపుగా తీసుకువస్తారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా సుమారు 5 లక్షల వరకు యాత్రికులు వస్తారని అంచనా. ఈ మేరకు ఏర్పాట్లు చేసినట్లు మేడ్చల్– మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గౌతమ్ తెలిపారు. అలాగే కీసరగుట్ట బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని జిల్లా స్థాయి క్రీడోత్సవాలు సోమవారం ఉదయం ప్రారంభం కానున్నాయి.
గురర్రంపై క్రీడాకారుడి విన్యాసం
Comments
Please login to add a commentAdd a comment