బీఆర్‌ఎస్ నాయకుడి ఆకస్మిక మృతి
ఇబ్రహీంపట్నం: ఎల్మినేడు గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్ నాయకుడు, ఎంపీటీసీ మాజీ సభ్యుడు, వ్యవసాయ మార్కెట్ మాజీ డైరెక్టర్ బుట్టి రాములు(60) శనివారం తెల్లవారుజామున ఆకస్మికంగా మృతి చెందారు. ఛాతిలో నొప్పి వస్తోందని చెప్పడంతో వెంటనే ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మరణించారు. ఆయన భార్య యాదమ్మ ఎల్మినేడు సర్పంచ్‌గా పనిచేశారు. కొన్నాళ్ల పాటు సీపీఎంలో పనిచేసిన రాములుకు మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డితో ఉన్న సాన్నిహిత్యం నేపథ్యంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. ముదిరాజ్ సామాజికవర్గానికి కులపెద్దగా సంఘం కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. రాములు మరణ వార్త తెలియగానే కిషన్‌రెడ్డి ఎల్మినేడుకు చేరుకుని నివాళులర్పించారు. బీఆర్‌ఎస్ నాయకుడు మంచిరెడ్డి ప్రశాంత్‌కుమార్‌రెడ్డి, గ్రంథాలయ సంస్థ జిల్లా మాజీ చైర్మన్ సత్తు వెంకటరమణారెడ్డి, మాజీ ఎంపీపీ కృపేశ్, మాజీ వైస్ ఎంపీపీ ప్రతాప్‌రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ మంచిరెడ్డి మహేందర్‌రెడ్డి, బుగ్గరాములు, భాస్కర్‌రెడ్డి, సీపీఎం జిల్లా కార్యదర్శి పి.యాదయ్య, జిల్లా కార్యవర్గ సభ్యులు సామేల్, జంగయ్య, ముదిరాజ్ సంఘ నియోజకవర్గ అధ్యక్షుడు భిక్షపతి తదితరులు నివాళులర్పించారు.
నివాళులర్పించిన పార్టీ నేతలు
Comments
Please login to add a commentAdd a comment