చేవెళ్ల: స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్‌గా పనిచేస్తున్న వినయ్‌కుమార్ గ్రూప్– 1లో 483వ ర్యాంకు, జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న చంద్రకాంత్ గ్రూప్– 2లో 27వ ర్యాంకు సాధించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ చంద్రకళ, డిప్యూటీ తహసీల్దార్ రాజశేఖర్, చేవెళ్ల తహసీల్దార్ కృష్ణయ్య తదితరులు వారిని శాలువాలతో సన్మానించారు.
చంద్రకాంత్ తీన్మార్..
ప్రభుత్వ ఉద్యోగం సాధించడమే గగనంగా మారిన ప్రస్తుత సమయంలో చంద్రకాంత్ వరుసగా మూడోసారి సర్కారు కొలువును చేజిక్కించుకున్నాడు. శంకర్‌పల్లి మండలం కొత్తపల్లికి చెందిన ఒగ్గు విఠలయ్య, వినోద దంపతుల రెండు కుమారుడైన ఈయన పీజీ పూర్తి చేసి, పోటీ పరీక్షలకు సిద్ధమయ్యాడు. ఈ క్రమంలో జూనియర్ లెక్చరర్ ఫలితాల్లో రాష్ట్రస్థాయి 3వ ర్యాంకు, గ్రూప్– 4లో 27వ ర్యాంకు సాధించాడు. ప్రస్తుతం చేవెళ్ల ఆర్డీఓ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. తాజాగా గ్రూప్– 2 ఫలితాల్లోనూ 27వ ర్యాంకుతో ఉన్నత ఉద్యోగానికి ఎంపికయ్యాడు. తన తల్లిదండ్రుల కష్టాన్ని చూసి పట్టుదలతో బాగా చదివానని చంద్రకాంత్ తెలిపారు.
గ్రూప్స్‌లో సత్తాచాటిన వినయ్, చంద్రకాంత్
Comments
Please login to add a commentAdd a comment