
సొంతూరికి వెళ్లొచ్చే సరికే..
అబ్దుల్లాపూర్‌మెట్: ఇంటి తాళాలు ధ్వంసం చేసిన దుండగులు బీరువాలోని బంగారు, వెండి ఆభరణాలతో పాటు, నగదును అపహరించుకుపోయిన సంఘటన స్థానిక పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ అంజిరెడ్డి తెలిపిన కథనం ప్రకారం.. మండలంలోని కవాడిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని ఉదయ్ గార్డెన్ కాలనీలో నీరుడు సతీష్ కుటుంబ సభ్యులు నివాసం ఉంటున్నాడు. ఆయన సోమవారం రాత్రి ఇంటికి తాళం వేసి స్వగ్రామమైన యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మండలం జూలూరులో జరిగే జాతరకు వెళ్లాడు. తిరిగి మంగళవారం ఉదయం ఇంటికి వచ్చి చూడగా.. గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి తాళాలు ధ్వంసం చేసి లోపలి ప్రవేశించినట్లు గుర్తించాడు. బీరువాలో ఉన్న 4 తులాల బంగారం, 80 తులాల వెండి వస్తువులు, నగదు దొంగిలించినట్లు నిర్ధారించుకున్నాడు. దాదాపు రూ.6.5 లక్షల విలువగల సొత్తును తస్కరించారని సతీష్ విలపించాడు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇంటి తాళాలు పగులుగొట్టి బంగారం, వెండి ఆభరణాల చోరీ
Comments
Please login to add a commentAdd a comment