
మైసమ్మ సన్నిధిలో జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు
కడ్తాల్: మండల పరిధిలోని మైసిగండి మైసమ్మను జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు హుస్సేన్ నాయక్ మంగళవారం ఉదయం దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా హుస్సేన్ నాయక్ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ నిర్వాహకులు శాలువాతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అంతకు ముందు కడ్తాల్ మండల కేంద్రంలో హుస్సేన్‌నాయక్‌కు బీజేపీ మండల శాఖ అధ్యక్షుడు దోనాదుల మహేశ్ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. అనంతరం మండల కేంద్రంలో లయన్స్‌క్లబ్ ఆఫ్ ఆమనగల్లు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రాగి అంబలి కేంద్రాన్ని ఆయన సందర్శించారు. కార్యక్రమంలో బీజేపీ గిరిజన మోర్చ రాష్ట్ర అధ్యక్షుడు కల్యాన్‌నాయక్, జిల్లా గిరిజన మోర్చ అధ్యక్షుడు సాయిలాల్‌నాయక్, జిల్లా నాయకులు రాందాస్‌నాయక్, భగీరథ్, శ్రీశైలంగౌడ్, కుమార్, మునేశ్, రెడ్యానాయక్, శ్యాంసుందర్ తదితరులు పాల్గొన్నారు.
ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉండాలి
ఆమనగల్లు: పోలీసులు ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉండాలని శంషాబాద్ డీసీపీ రాజేశ్ సూచించారు. పోలీసు స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదగా మసలుకోవాలని అన్నారు. ఆమనగల్లు పట్టణంలోని పోలీసుస్టేషన్‌ను మంగళవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీసు స్టేషన్ పరిసరాలు, వివిధ కేసుల్లో పట్టుబడిన వాహనాలను, పోలీసుస్టేషన్‌లో కేసుల రికార్డులను పరిశీలించారు. పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ.. శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులకు ప్రజలు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో ఆమనగల్లు సీఐ ప్రమోద్‌కుమార్, ఎస్‌ఐలు వెంకటేశ్, సీతారాంరెడ్డి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
బాటసింగారంలో పోలీస్ ఔట్ పోస్టు ఏర్పాటు చేయండి
అబ్దుల్లాపూర్ మెట్: మామిడి సీజన్ దృష్ట్యా బాటసింగారంలోని పండ్ల మార్కెట్లో పోలీస్ ఔట్ పోస్ట్ ఏర్పాటు చేయాలని కోరుతూ గడ్డిఅన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి, పాలకవర్గం సభ్యులు మంగళవారం రాచకొండ సీపీ జి. సుధీర్బాబుకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ.. మామిడి సీజన్ కావడంతో దిగుమతులు భారీగా ఉంటాయని, క్రయ విక్రయాలు, నగదు లావాదేవీలు అధికంగా జరుగుతాయని తెలిపారు. మార్కెట్లో చోరీలు జరిగే ఆస్కారం ఉందన్నారు. అంతే కాకుండా కొంత మంది బ్రోకర్లతో కుమ్మకై మార్కెట్ బయట వ్యాపారం చేస్తూ పండ్లు అక్రమంగా అమ్ముతున్నారని, మార్కెట్ ఆదాయానికి గండి పడుతోందని అన్నారు. ఇలాంటి వారిపై నిఘా ఉంచి చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో మార్కెట్ వైస్ చైర్మన్ సీహెచ్ భాస్కరచారి, మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి ఎల్.శ్రీనివాస్, పాలకవర్గ సభ్యులు వన్యాల జైపాల్ రెడ్డి, మెగావత్ గణేశ్ నాయక్, రఘుపతిరెడ్డి, దోమలపల్లి, అంజయ్య, వెంకటేశ్వర్లు, గుప్తా తదితరులు పాల్గొన్నారు.

మైసమ్మ సన్నిధిలో జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు
Comments
Please login to add a commentAdd a comment