
బేజారు
సేవలు అంతంతే..
● సమయపాలన పాటించని వైద్యులు, సిబ్బంది ● అరకొర మందుల పంపిణీ ● పరీక్షలకు విషమ ‘పరీక్షే’.. ● గంటల తరబడి రోగుల నిరీక్షణ
సర్కారు దవాఖానాల్లో రోగులకు పాట్లు తప్పడం లేదు.. మంగళవారం ఉదయం జిల్లాలోని పలు ఆస్పత్రుల్లో ‘సాక్షి’ విజిట్ చేసింది.. రోగులకు వైద్య సేవలు అందించాల్సిన సిబ్బంది సమయ పాలన పాటించడం లేదు. ఉదయం 9 గంటలకే వైద్యులతోపాటు సిబ్బంది రావాల్సి ఉండగా తీరిగ్గా 10 గంటల తరువాతే వస్తున్నారు.. వైద్యుల కోసం బాధితులు గంటల తరబడి నిరీక్షించడం కనిపించింది.. మరికొన్ని చోట్ల సిబ్బంది కొరత వేధిస్తోంది.. ఇక మందుల కొరత.. టెస్టులు సరేసరి..
10.30 గంటల తర్వాత
యాచారం: మండల కేంద్రంలోని సీహెచ్‌సీ కేంద్రానికి ఉదయం 10.30 గంటల తర్వాత ముగ్గురు వైద్యులు వచ్చారు. అప్పటికే రోగులు వచ్చి వేచి చూస్తున్నారు. మధ్యాహ్నం వరకు 140 మంది వరకు కాళ్లు, కీళ్ల నొప్పులు, బీపీ, షుగర్ వ్యాధులతో బాధపడుతూ ఆస్పత్రికి వచ్చారు. వారికి పరీక్షలు నిర్వహించి కావాల్సిన మందులు ఇచ్చి పంపించారు. వైద్య పరీక్షలకు అనుగుణంగా మందులు అందుబాటులో ఉన్నాయని వైద్యురాలు రాజ్యలక్ష్మి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment