
సింబయాసిస్‌లో విద్యార్థి మృతి
నందిగామ: అనుమానాస్పద స్థితిలో ఓ విద్యార్థి మృతిచెందిన ఘటన మండల పరిధిలోని మోదళ్ల గూడ శివారు సింబయాసిస్ అంతర్జాతీయ విశ్వవిద్యాలయంలో సోమవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. ఎస్‌ఐ గోపాల కృష్ణ కథనం ప్రకారం వివరాలు.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం గజియాబాద్, సంఘంనగర్‌కు చెందిన శాగనిక్‌బాసు (21) యూనివర్సిటీ హాస్టల్‌లో ఉంటూ బీఏ ఎల్‌ఎల్‌బీ తృతీయ సంవత్సరం చదువుతున్నాడు. సోమవారం అర్ధరాత్రి సుమారు 1.30 గంటల ప్రాంతంలో తన గదిలోని బాత్‌రూంలోకి వెళ్లి, చాలా సేపైనా బయటకు రాలేదు. దీంతో స్నేహితులు రోహిత్, హర్షిత్ పాండేలు బాత్‌రూం వెంటిలేటర్ నుంచి చూడగా అపస్మారక స్థితిలో కిందపడిపోయి ఉన్నాడు. దీంతో తలుపును బద్ధలు కొట్టి అతన్ని క్యాంపస్‌లో వైద్యుడి వద్దకు తీసుకెళ్లారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో మెరుగైన చికిత్స నిమిత్తం శంషాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు బాసు మృతి చెందినట్లు ధ్రువీకరించారు. దీంతో మృతదేహాన్ని హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. మృతుడి తండ్రి పార్థబాసు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
స్థానికుల ఆందోళన..
విద్యార్థి మృతి చెందిన విషయం తెలుసుకున్న స్థాని కులు మంగళవారం వర్సిటీ ఎదుట ఆందోళనకు దిగారు. విద్యార్థులను యాజమాన్యం పట్టించుకోకపోవడంతో మత్తు పదార్థాలు తీసుకుని బయటకు వచ్చి న్యూసెన్స్ చేస్తున్నారని ఆరోపించారు. విద్యార్థి మృతిపై అనుమానాలున్నాయన్నారు. ఈ విష యమై వర్సిటీ డైరెక్టర్ వేణుగోపాల్ మాట్లాడుతూ.. విద్యార్థి గుండెపోటుతో మృతిచెందాడని ప్రాథమిక సమాచారం అందిందని, పోస్టుమార్టం నివేదిక వచ్చాక పూర్తి విషయాలు తెలుస్తాయని చెప్పారు.
యూనివర్సిటీ ఎదుట స్థానికుల ఆందోళన
యాజమాన్యం విద్యార్థులను పట్టించుకోవడం లేదని ఆరోపణ

సింబయాసిస్‌లో విద్యార్థి మృతి
Comments
Please login to add a commentAdd a comment