
సిబ్బంది కొరతతో ఇబ్బంది
కడ్తాల్: మండల పరిధిలోని మైసిగండి ప్రాథథమిక ఆరోగ్య కేంద్రంలో రెగ్యులర్ డాక్టర్ సెలవుపై వెళ్లగా ఇన్‌చార్జి డాక్టర్ విధులు నిర్వర్తిస్తున్నారు. ఆస్పత్రిలో సీహెచ్‌ఓతో పాటు ఒక స్టాఫ్ నర్స్ మాత్రమే విధుల్లో ఉన్నారు. ఒంటి నొప్పులు, బలహీనత, సాధారణ జ్వరంతో బాధపడుతున్న వారికి పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు. తీవ్ర జ్వరంతో బాధపడే రోగులకు రక్త పరీక్షల కోసం రక్తాన్ని సేకరించి టీహబ్‌కు పంపిస్తున్నారు. రిపోర్టుల కోసం మరుసటి రోజు వరకు వేచి చూడాల్సి వస్తోంది. ఒక్కరే వైద్యులు ఉండటంతో రోగులు ఇబ్బంది పడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment