
రూ.32 లక్షల బకాయి
ఆమనగల్లు: వీధి దీపాలకు సంబంధించి విద్యుత్‌శాఖకు మున్సిపాలిటీ దాదాపు రూ.32 లక్షల బకాయి పడింది. మున్సిపల్ పరిధిలో మొత్తం 1,657 వీధి దీపాలు ఉన్నాయి. నూతనంగా వెలసిన కాలనీల్లో ఇంకా ఏర్పాటు చేయాల్సి ఉంది. హైదరాబాద్–శ్రీశైలం జాతీయ రహదారిపై సెంట్రల్ లైటింగ్‌కు సంబంధించి 120 స్తంభాలు ఉండగా 240 వీధిదీపాలు ఉన్నాయి. మున్సిపాలిటీలో వినియోగిస్తున్న వీధి దీపాలకు సంబంధించి ప్రతినెలా రూ.1.55 లక్షల దాకా బిల్లు వస్తోంది. ఏడాదికాలంగా చెల్లించకపోవడంతో రూ.32 లక్షల బకాయి ఉన్నట్లు అధికారులు తెలిపారు. కొత్త కాలనీల్లో వీధిదీపాలు ఏర్పాటు చేయాలని ఆయా కాలనీల ప్రజలు కోరుతున్నారు.
ఆమనగల్లులో జాతీయ రహదారిపై ఉన్న వీధిదీపాలు
‡
‡