ఆమనగల్లు: మున్సిపాలిటీలో ఆస్తిపన్ను వసూళ్ల లక్ష్యం సగం పూర్తయ్యింది. విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నా ప్రజలు సకాలంలో కట్టడం లేదు. వసూలు కోసం వార్డు అధికారులు, సిబ్బంది ఇల్లిల్లూ తిరుగుతున్నారు. పెద్ద మొత్తంలో ఉన్న బకాయిల వసూళ్లకు మున్సిపల్ కమిషనర్ శంకర్ స్వయంగా వెళ్తున్నారు. మున్సిపాలిటీలో ఈ ఏడాది ఆస్తిపన్ను లక్ష్యం రూ.2.21 కోట్లుగా ఉంది. ఇప్పటివరకు రూ.1.15 కోట్లు మాత్రమే వసూలైంది. వందశాతం పూర్తి చేయడానికి సిబ్బంది విస్తృతంగా తిరుగుతున్నారు.