● దూకుడు పెంచిన అధికారులు
షాద్‌నగర్: ఆస్తి పన్నుల వసూళ్లలో మున్సిపల్ అధికారులు దూకుడు పెంచారు. ఆర్థిక సంవత్సరం పూర్తి కావడానికి కొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉండడంతో గడువులోపు వంద శాతం వసూలు చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. బకాయిలు ఉన్న వారికి నోటీసులు జారీ చేసి వసూలు చేస్తున్నారు. సుమారు 70 వేలకుపైగా జనాభా ఉన్న షాద్‌నగర్ మున్సిపాలిటీలో మొత్తం 28 వార్డులు ఉన్నాయి. మున్సిపల్ పరిధిలో 15,933 గృహ, వ్యాపార సముదాయాలు ఉన్నా యి. వీటి నుంచి సుమారు రూ.7.47 కోట్ల పన్నులు వసూలు కావాల్సి ఉంది. ఇందులో ఇప్పటి వరకు సుమారు రూ.5.26 కోట్లు (71శాతం) వసూలయ్యాయి. ఇంకా రూ.2.22కోట్లకు పైగా వసూలు చేయాల్సి ఉంది.
కొత్తూరులో రూ.1.57 కోట్లు..
కొత్తూరు మున్సిపాలిటీలో మొత్తం 13,200 జనాభా ఉంది. 2,619 ఇళ్లు, వ్యాపార సముదాయాలు ఉన్నాయి. వీటి నుంచి రూ.2.56 కోట్ల పన్నులు వసూలు కావాల్సి ఉంది. ఇప్పటి వరకు రూ.1.57 కోట్లు వసూలు చేశారు. ఇంకా రూ.98.6 లక్షలు వసూలు కావాల్సి ఉందని అధికారులు తెలిపారు.
రంగంలోకి ‘ప్రత్యేక’ బృందాలు
మార్చి 31తో ఆర్థిక సంవత్సరం ముగియనున్న నేపథ్యంలో వంద శాతం పన్నులు వసూలు చేసేందుకు షాద్‌నగర్‌లో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఫంక్షన్ హాళ్లు, పెట్రోల్ బంకులు, సినిమా హాళ్లు, వ్యాపార సముదాయాలు, ఇళ్ల నుంచి పన్నులు వసూలు చేస్తున్నారు. మొండి బకాయిల వసూళ్లపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. బకాయిదారులకు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. మున్సిపల్ సిబ్బంది బకాయిదారుల ఇళ్లు, దుకాణాల వద్దకు వెళ్లి వసూలు చేస్తున్నారు.
న్యూస్‌రీల్
సోమవారం శ్రీ 24 శ్రీ మార్చి శ్రీ 2025