నిధులు సద్వినియోగం చేసుకోవాలి
సంగారెడ్డి జోన్: ప్రభుత్వం కేటాయించిన నిధులను సమర్థవంతంగా సద్వినియోగం చేసుకుని, మౌలిక వసతులు మెరుగుపరచుకోవాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి పేర్కొన్నారు. సంగారెడ్డి కలెక్టరేట్‌లో పంచాయతీరాజ్ ఇంజనీరింగ్, మండల విద్యాశాఖ అధికారులతో ఎంపిక చేసిన పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో పాఠశాలల అభివృద్ధి పనులపై శనివారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ...పీఎంశ్రీ పథకం కింద జిల్లాలో 44 పాఠశాలలు ఎంపికయ్యాయన్నారు. మంజూరైన నిధులతో ఆ పాఠశాలల్లో క్రీడలు,నైపుణ్యాభి వృద్ధి, తరగతి గదుల నిర్మాణం, కిచెన్ గార్డెన్, ఫీల్డ్ విజిట్, ఎల్‌ఈడీ లైటింగ్, లైబ్రరీ అభివృద్ధి, మరుగుదొడ్లు, తాగునీటి వసతి, ల్యాబ్ ఏర్పాట్లు వంటి తదితర అభివృద్ధి పనులకు వినియోగించాలని అధికారులకు సూచించారు. ఈ అభివృద్ధి పనులను నిర్దేశిత కాలవ్యవధిలో నాణ్యతతో వేగంగా పూర్తి చేయాలని చెప్పారు. కార్యక్రమంలో డీఈవో వెంకటేశ్వర్లు, ఈఈపీ ఆర్ జగదీశ్, ఎంఈవోలు, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులు, ప్రధానోపాధ్యాయులు, సంబంధిత అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
కలెక్టర్ వల్లూరు క్రాంతి
Comments
Please login to add a commentAdd a comment