ఉద్యోగాల నుంచి తొలగించడం సరికాదు
సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లికార్జున్
సంగారెడ్డి ఎడ్యుకేషన్: జిల్లాలోని ఎంఆర్‌ఎఫ్ పరిశ్రమలో నాలుగేళ్లుగా పని చేస్తున్న కార్మికులను ఆకస్మాత్తుగా తొలగించడం సరికాదని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లికార్జున్ డిమాండ్ చేశారు. కార్మికులను డ్యూటీలోకి తీసుకోవాలని కోరుతూ సీఐటీయూ ఆధ్వర్యంలో మంగళవారం కేవల్‌కిషన్ భవన్ నుంచి కలెక్టరేట్ వరకు కార్మికులకు మద్దతుగా సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లిఖార్జున్ మాట్లాడుతూ.. ఎంఆర్‌ఎఫ్ యాజమాన్యం కార్మికులను భయభ్రాంతులకు గురి చేసి ఉద్యోగం నుంచి తొలగించడం దుర్మార్గమన్నారు. సమస్యలు పరిష్కరించమని అడిగితే ఉద్యోగం నుంచి ఎలా తొలగిస్తారని ప్రశ్నించారు. తక్షణమే కార్మికులను డ్యూటీలోకి తీసుకొని కార్మికులందరిని పర్మినెంట్ చేయాలన్నారు. అనంతరం డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్‌కు వినతిపత్రం అందజేశారు. ధర్నాలో సీఐటీయూ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మల్లేశం, సాయిలు సీఐటీయూ జిల్లా నాయకులు రాజయ్య, ప్రవీణ్ కుమార్, మహిపాల్‌తో పాటు పరిశ్రమ కార్మికులు పాల్గొన్నారు .,
Comments
Please login to add a commentAdd a comment