చెత్తను తగలబెడుతున్నారు
● వాయుకాలుష్యంతో సతమతమవుతున్నాం
● కొల్లూరువాసుల ఆగ్రహం
రామచంద్రాపురం(పటాన్‌చెరు): రోడ్లపై చెత్తను తగలబెడితే చర్యలు తప్పవని హెచ్చరించే అధికారులు.. డంపింగ్ యార్డులో చెత్తను తగలబెడుతూ వాయుకాలుష్యానికి కారకులవుతున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని కొల్లూరులో చెత్త డంపింగ్ యార్డు కోసం గత ప్రభుత్వం ఐదెకరాల భూమిను కేటాయించింది. దానితో పాటు కోటి రూపాయల అంచనాతో ఫీకల్ స్లడ్జ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ (ఎఫ్‌ఎస్‌టీపీ) నిర్మించారు. కానీ అది ఇంత వరకు ప్రారంభోత్సవానికి నోచుకోవడంలేదు. దానితో పాటు రూ.25లక్షలతో కాంపోస్ట్ షెడ్, రూ.25లక్షలతో డ్రై రిసోర్స్ కలెక్షన్ సెంటర్‌ను నిర్మించారు. ఇన్ని సదుపాయలున్న తడి చెత్త, పొడి చెత్తను వేరు చేయడంలో అధికారులు పూర్తిగా విఫలం చెందుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తడి చెత్త, పొడి చెత్తతో ఎరువులను తయారు విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఉన్నతాధికారులు చెబుతున్నా.. స్థానిక అధికారులు పట్టించుకున్న పాపానపోవడం లేదు. డంపింగ్ యార్డు పరిసరాల ప్రాంతంలో నివసించే వారు నిత్యం వాయుకాలుష్యంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికై నా కలెక్టర్ స్పందించి తమ సమస్యను పరిష్కారించాలని స్థానికులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment