అన్ని రంగాల్లో మహిళలకు ప్రోత్సాహం
జహీరాబాద్: మహిళలను అనేక రంగాల్లో ముందుకు తీసుకెళ్లాలనే లక్ష్యంతో నాబార్డు(జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంకు) బ్యాంకు పలు కార్యక్రమాలను చేపట్టిందని ఆ బ్యాంకు జనరల్ మేనేజర్ ఉదయ్ భాస్కర్ పేర్కొన్నారు. మండలంలోని దిడిగి గ్రామ శివారులో గల డీడీఎస్–కేవీకేలో మంగళవారం నిర్వహించిన మహిళా వారోత్సవాల సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దేశవ్యాప్తంగా 1.20లక్షల మహిళా సంఘాలు, ఐకేపీ, డ్వాక్రా సంఘాలున్నాయని ఈ సంఘాల అభివృద్ధిలో నాబార్డు పాత్ర విస్మరించలేనిదన్నారు. ఇప్పటివరకు మహిళా సంఘాలకు వివిధ బ్యాంకుల ద్వారా రూ.57వేల కోట్లను రుణాల రూపంలో ఇచ్చామని తెలిపారు. నాబార్డు ద్వారా మహిళ, రైతు ఉత్పాదక సంఘాలు ఏర్పాటు చేసుకున్నారన్నారు. టైలరింగ్, మగ్గం, బ్యూటీషియన్ రంగాల్లో జీవనోపాధి కోసం 30 రోజుల శిక్షణ, ఎల్‌ఈడీపీ 90 రోజుల శిక్షణ ఇప్పించి యంత్రాలు అందిస్తున్నామని తెలిపారు. మహిళా సంఘాల ఉత్పత్తుల మార్కెటింగ్‌కు నాబార్డు పోత్సహిస్తోందని చెప్పారు. సమావేశంలో టీఎస్‌ఐఐసీ చైర్మన్ నిర్మలారెడ్డి, ఆర్‌ఎస్‌ఈటీఐ డైరెక్టర్ రాజేంద్రప్రసాద్, నాబార్డు డీజీఎం స్వాతి తివారి, డీడీఎంలు కృష్ణతేజ, నిఖిల్‌రెడ్డి, సఖి అధికారి కల్పన, శాస్త్రవేత్త సి.వరప్రసాద్ పాల్గొన్నారు. అనంతరం ఆయా ప్రాంతాల నుంచి నాబార్డు సహకారంతో ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. ఆయా రంగాల్లో సేవలందిస్తున్న మహిళలను ఘనంగా సత్కరించారు.
నాబార్డు జనరల్ మేనేజర్ ఉదయ్ భాస్కర్
Comments
Please login to add a commentAdd a comment