మహిళల్ని మోసం చేసిన ఘనత కాంగ్రెస్‌దే
ఎమ్మెల్యే సునీతారెడ్డి
పటాన్‌చెరు టౌన్: అధికారంలోకి వస్తే మహిళలకు రూ. పది లక్షలు, పావలా వడ్డీ రుణం ఇస్తామని మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చి వారిని నిలువును మోసం చేసిన ఘనత కాంగ్రెస్‌పార్టీదేనని మాజీమంత్రి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి విమర్శించారు. పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని జీహెచ్‌ఎంసీ మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్‌లో కార్పొరేటర్ మెట్టు కుమార్‌యాదవ్ ఆధ్వర్యంలో మంగళవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సునీతారెడ్డి పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో మహిళలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేదన్నారు. ఇప్పటికై నా సీఎం రేవంత్‌రెడ్డి మహిళలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని మహిళల తరపున డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ మాలోత్ కవిత, తెలంగాణ రాష్ట్ర మాజీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సుమిత్ర ఆనంద్, సంగారెడ్డి జిల్లా పరిషత్ మాజీ చైర్‌పర్సన్ మంజుశ్రీ, మాజీ శాసనమండలి చైర్మన్ సతీమణి గీత, బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు మాజీ కార్పొరేటర్ శంకర్ యాదవ్, ఆదర్శ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment