చదువుతోనే గుర్తింపు
టీజీఐఐసీ చైర్‌పర్సన్ నిర్మలారెడ్డి
సదాశివపేట(సంగారెడ్డి): చదువుతోనే సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుందని విద్యార్థులందరు క్రమశిక్షణ పట్టుదలతో చదువుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మలారెడ్డి సూచించారు. పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులతో మంగళవారం నిర్వహించిన ముఖముఖి కార్యక్రమంలో అమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్మలారెడ్డిని విద్యార్థులు వివిధ ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు. బాల్యం నుంచి రాజకీయ జీవితం, వారి వైవాహిక జీవితం, ఇతర విషయాల గురించి ప్రశ్నలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రిన్సిపాల్ భారతి మాట్లాడుతూ ఇంగ్లిష్, తెలుగు సబ్జెక్టుల్లో ఇంటర్వ్యూ స్కిల్స్ ఎట్లా పెంపొందించుకోవాలి వంటి అంశాలపై విద్యార్థులకు శిక్షణనిచ్చినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment