చోరీ సొత్తు స్వాధీనం
సీసీ కెమెరాల ఆధారంగా దొంగ గుర్తింపు
పెద్దశంకరంపేట(మెదక్): పెద్దశంకరంపేటకు చెందిన విగ్రాం శ్రీనివాస్‌గౌడ్ నివాసంలో రెండు రోజుల కిందట బంగారం, నగదు చోరీకి గురైంది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు గురువారం దొంగను గుర్తించి పట్టుకొని సొత్తులు స్వాధీనం చేసుకున్నారు. అల్లాదుర్గం సీఐ రేణుకారెడ్డి, ఎస్‌ఐ శంకర్ తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీనివాస్‌గౌడ్ మంగళవారం ఇంటికి తాళం వేసి కర్ణాటకలోని గాన్‌గాపూర్‌కు వెళ్లాడు. బుధవారం ఇంటి తాళం పగులగొట్టి ఉండగా పని మనిషి గుర్తించింది. వెంటనే శ్రీనివాస్ గౌడ్ ఇంటి పక్కనే ఉంటున్న అతడి తమ్ముడికి సమాచారం ఇచ్చింది. ఇంట్లో బంగారం, నగదు పోయినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా మండల కేంద్రానికి చెందిన ఎర్ర నాగరాజుగౌడ్ పట్టుకొని విచారించగా నేరం ఒప్పుకున్నాడు. నిందితుడి నుంచి శ్రీ వేంకటేశ్వర దేవాలయానికి సంబంధించి ఆరు తులాల బంగారం, వెండి, రూ.6 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. దేవాలయాన్ని సొంతంగా శ్రీనివాస్‌గౌడ్ కట్టించగా ఆభరణాలు ఇంట్లో దాచి పెట్టారు.
Comments
Please login to add a commentAdd a comment