
బీఆర్‌ఎస్‌పై వెల్లువెత్తిన నిరసనలు
సంగారెడ్డి జోన్/సదాశివపేట(సంగారెడ్డి)/నారాయణఖేడ్: దళితుల పట్ల, స్పీకర్ గడ్డం ప్రసాద్ పట్ల బీఆర్‌ఎస్ పార్టీ తీరును నిరసిస్తూ ఆదివారం కాంగ్రెస్ పార్టీ జిల్లావ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేసింది. ఆందోళనలో భాగంగా సంగారెడ్డి, నారాయణఖేడ్, సదాశివపేటల్లో ప్రధాన రహదారులపై కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నిరసనల ర్యాలీలు చేపట్టారు. అనంతరం బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ...స్పీకర్ గడ్డం ప్రసాద్‌పై మాజీమంత్రి జగదీశ్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలన్నారు. బీఆర్‌ఎస్ పార్టీ దళిత వ్యతిరేక పార్టీ అని, దళితుడు స్పీకర్‌గా ఉండటం ఆ పార్టీకి ఇష్టం లేదన్నారు. గతంలో కూడా దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని, మూడు ఎకరాలు ఇస్తానని మోసం చేసిన పార్టీ బీఆర్‌ఎస్ అని విమర్శించారు. నారాయణఖేడ్ నియోజకవర్గంలోని నిజాంపేట్, నాగల్‌గిద్ద, మనూరు మండలాల్లోనూ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నిరసన కార్యక్రమాలను చేపట్టారు. కార్యక్రమంలో టీపీసీసీ కార్యదర్శి ఆంజనేయులు, తోపాజి అనంత కిషన్, సీడీసీ చైర్మన్ రామ్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ రామచందర్ నాయక్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రఘు గౌడ్, ఆత్మకమిటీ చైర్మన్ ప్రభు, యువజన కాంగ్రెస్ జిల్లా నాయకుడు కై న సంతోష్, మండల అధ్యక్షులు మోతీలాల్ నాయక్, నాయకులు సిద్దన్న, బుచ్చి, రాములు తదితరులు పాల్గొన్నారు.
మాజీమంత్రి, ఎమ్మెల్యే
జగదీశ్‌రెడ్డి తీరుపై ఆగ్రహం
జిల్లావ్యాప్తంగా ఆందోళనలు
కేటీఆర్, జగదీశ్‌రెడ్డి దిష్టిబొమ్మలు
దహనం

బీఆర్‌ఎస్‌పై వెల్లువెత్తిన నిరసనలు
Comments
Please login to add a commentAdd a comment