కార్మికుల కోసం నిరంతర పోరాటం
పటాన్‌చెరు: గత 40 ఏళ్లుగా కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా శాండ్విక్ ఎంప్లాయిస్ యూనియన్ నిరంతర పోరాటం చేస్తుందని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు, శాండ్విక్ యూనియన్ అధ్యక్షుడు చుక్కా రాములు పేర్కొన్నారు. పటాన్‌చెరు పారిశ్రామిక ప్రాంతంలోని శాండ్విక్ ఎంప్లాయిస్ యూనియన్ సీఐటీయూ అనుబంధంగా 40 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా పోచారం గ్రామ పరిధిలో కార్మికులకు క్రికెట్ పోటీలను నిర్వహించారు. ఈ పోటీల ప్రారంభోత్సవానికి హాజరైన చుక్కా రాములు మాట్లాడుతూ... 40 ఏళ్లపాటు ఒకే నాయకత్వంలో కార్మికుల ఐక్యతతో అనేక విజయాలు సాధించడం హర్షణీయమన్నారు.
సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్కా రాములు
Comments
Please login to add a commentAdd a comment