
డుమ్మా టీచర్లపై చర్యలు
జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు
నారాయణఖేడ్: పాఠశాల సమయాల్లో విధుల్లో ఉండకుండా డుమ్మాకొట్టిన ఉపాధ్యాయులపై చర్యలు తీసుకుంటామని జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు గురువారం ‘సాక్షి’కి తెలిపారు. ఈ అంశంపై విచారణకు ఖేడ్ ఎంఈవోను ఆదేశించారు. కాగా టీచర్లపై చర్యలు తీసుకోకుండా ఉండేందుకు స్థానిక అధికారులు సహకరించే ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. డివిజన్ కేంద్రమైన నారాయణఖేడ్ పట్టణానికి కిలోమీటర్ దూరంలో ఉన్న జూకల్ పాఠశాలలో బుధవారం మధ్యాహ్నం 12.30గంటలకు ఇద్దరు టీచర్లు బాబురావు, కవిత డుమ్మాకొట్టి వెళ్లిపోయారు. దీంతో విద్యార్థులు ఆరుబయట ఆడుతూ కన్పించారు. టీచర్ల డుమ్మాపై ‘సాక్షి’ దినపత్రికలో ‘పాఠశాలలో టీచర్ల డుమ్మా’ శీర్షికన కథనం ప్రచురితమైన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment