అదృశ్యమైన వ్యక్తి చెరువులో మృతదేహమై లభ్యం
సంగారెడ్డి క్రైమ్: ఇంటి నుంచి వెళ్లి అదృశ్యమైన వ్యక్తి పట్టణంలోని మార్చ్‌నగర్ చె రువులో మృతదేహ మై లభ్యమయ్యాడు. పట్టణ సీఐ రమేశ్ కథనం మేరకు.. సంగారెడ్డి పట్టణంలోని మార్చ్‌నగర్ కాలనీకి చెందిన షేక్ మహబూబ్(40) ట్రాక్టర్ డ్రెవర్‌గా పని చేస్తున్నాడు. 12న తన యజమాని కల్వకుంటకు చెందిన అక్బర్ ఇంట్లో ఫంక్షన్‌కు వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు చుట్టుపక్కల వెతికినా ఆచూకీ లభించలేదు. గురువారం ఉదయం కల్వకుంట నుంచి చిమ్నాపూర్ గ్రామానికి వెళ్లే మార్గంలో గల ఎర్రకుంట చెరువు ఒడ్డున మహబూబ్‌కు చెందిన దుస్తులు, చెప్పులు కనిపించాయి. కుటుంబ సభ్యులు వెంటనే పట్టణ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు మృతదేహం కోసం గాలించినా దొరకలేదు. పక్కనే దీనికి అనుకొని ఉన్న మరో చెరువు మార్చ్‌నగర్ చెరువులో శుక్రవారం ఉదయం పోలీసులు మున్సిపాలిటీ సిబ్బందితో గాలిస్తుండగా మృతదేహం లభ్యమైంది. కుటుంబీకులకు సమాచారం ఇచ్చి మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment