
అంబులెన్స్‌కు దారి
బీఆర్‌ఎస్ రజతోత్సవ సభ సందర్భంగా ఆదివారం రంగదాంపల్లి అమరవీరుల స్థూపం చౌరస్తా వద్ద ఎల్కతుర్తికి వెళ్లే వాహనాలతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఇదే సమయంలో అటుగా వెళ్తున్న అంబులెన్స్ ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకుంది. దీంతో అక్కడ ఉన్న బీఆర్‌ఎస్ యువ కార్యకర్తలు రోడ్డుకు అడ్డంగా ఉన్న బారీ కేడ్లను తొలగించి, దారి ఇవ్వండి అని వాహనాలకు చెబుతూ అంబులెన్స్ వెళ్లేలా చేశారు. అక్కడ ఉన్న వారు అందరూ యువకులను అభినందించారు.
– ఫోటో : సాక్షి స్టాఫ్ ఫోటోగ్రాఫర్, సిద్దిపేట