కొడకంచిలో మట్టి అక్రమ తరలింపు | - | Sakshi
Sakshi News home page

కొడకంచిలో మట్టి అక్రమ తరలింపు

Published Thu, Jun 22 2023 2:46 AM | Last Updated on Thu, Jun 22 2023 12:00 PM

కొడకంచిలో మట్టి తరలింపు  ప్రాంతాన్ని చూపుతున్న నాయకులు  - Sakshi

కొడకంచిలో మట్టి తరలింపు ప్రాంతాన్ని చూపుతున్న నాయకులు

జిన్నారం (పటాన్‌చెరు): కొడకంచిలో క్రషర్‌ నుంచి భారీగా మట్టిని తరలిస్తున్నారని, దీనిని ఆపేలా అధికారులు చర్యలు తీసుకోవాలని మాజీ సర్పంచ్‌ శ్రీశైలం, గ్రామ నాయకులు భాస్కర్‌, సాయి, దుబ్బ శ్రీనివాస్‌, భిక్షపతి తదితరులు డిమాండ్‌ చేశారు. బుధవారం మట్టిని తరలిస్తున్న ప్రాంతాన్ని వారు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రషర్‌ యజమాని నిబంధనలకు విరుద్ధంగా మట్టిని తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారుల అండదండలతోనే ఈ వ్యాపారం నడుస్తోందని ఆరోపించారు. రాత్రి సమయంలో వందల సంఖ్యలో టిప్పర్‌ల ద్వారా మట్టిని తరలిస్తున్నారన్నారు. ఈ విషయమై అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. మట్టి తరలింపుపై కలెక్టర్‌కు కూడా ఫిర్యాదు చేశామన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement