tippar
-
కొడకంచిలో మట్టి అక్రమ తరలింపు
జిన్నారం (పటాన్చెరు): కొడకంచిలో క్రషర్ నుంచి భారీగా మట్టిని తరలిస్తున్నారని, దీనిని ఆపేలా అధికారులు చర్యలు తీసుకోవాలని మాజీ సర్పంచ్ శ్రీశైలం, గ్రామ నాయకులు భాస్కర్, సాయి, దుబ్బ శ్రీనివాస్, భిక్షపతి తదితరులు డిమాండ్ చేశారు. బుధవారం మట్టిని తరలిస్తున్న ప్రాంతాన్ని వారు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రషర్ యజమాని నిబంధనలకు విరుద్ధంగా మట్టిని తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారుల అండదండలతోనే ఈ వ్యాపారం నడుస్తోందని ఆరోపించారు. రాత్రి సమయంలో వందల సంఖ్యలో టిప్పర్ల ద్వారా మట్టిని తరలిస్తున్నారన్నారు. ఈ విషయమై అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మట్టి తరలింపుపై కలెక్టర్‌కు కూడా ఫిర్యాదు చేశామన్నారు. -
టీఎస్ ఆర్టీసీ బస్సు, టిప్పర్ ఢీ
సాక్షి, దండేపల్లి : మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం కన్నెపల్లి స్టేజ్ వద్ద టీఎస్ ఆర్టీసీ బస్సు, టిప్పర్ ఢీకొన్న ఘటనలో పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే..హైదరాబాద్ నుండి ఉట్నూర్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు- ఇసుక లోడ్‌తో కరీంనగర్ వైపు వెళుతున్న టిప్పర్ ఒకదానికొకటి ఢీ కొన్నాయి. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్నవారిలో ఎనిమిదిమంది గాయపడ్డారు. అయితే ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. లారీ డ్రైవర్ క్యాబిన్లో ఇరుక్కుపోవడంతో జేసీబీ సాయంతో అతన్ని బయట తీసేందుకు పోలీసులు యత్నిస్తున్నారు. మరోవైపు సమాచారం అందుకున్న 108 సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులకు ప్రాథమిక చికిత్స అందించారు. -
విహారయాత్రకు వెళ్లి వస్తూ మృత్యువు ఒడిలోకి..
కన్నవారి ఆశలు ఆవిరయ్యాయి. అల్లారి ముద్దుగా పెంచుకుంటున్న పిల్లల్ని మృత్యువు కబళించడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. విహార యాత్రల కోసం వెళ్లిన చిన్నారులను మృత్యువు టిప్పర్ రూపంలో వచ్చి పొట్టనపెట్టుకోవడంతో ఆ ప్రాంతమంతా విషాదంతో నిండిపోయింది. ఈ ఘోరం పెదబయలు మండలం గంపరాయి గ్రామ సమీపంలోని ఘాట్ రోడ్డులో చోటుచేసుకోగా.. పల్లయదొర ముఖేష్ (8), పుల్లయదొన స్వప్న(6) అన్నాచెల్లెళ్లు మృత్యువాత పడ్డారు. విశాఖపట్నం , పెదబయలు (అరకులోయ): పర్రెడ గ్రామానికి చెందిన పుల్లయదొర వెంకటరావు, అప్పలమ్మలు పిల్లల చదువు కోసమని విశాఖపట్నం గాజువాక ప్రాంతానికి కొన్నేళ్ల క్రితం వచ్చి స్థిరపడ్డారు. ఓ ప్రైవేటు షాపులో రాడ్ బెండింగ్ పనులు చేసుకుంటూ వచ్చే ఆదాయంతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. వీరికి బాబు ముఖేష్, పాప స్వప్న అనే పిల్లలు ఉన్నారు. బాబు ఒకటి, పాప నర్సరీ చదువుతున్నారు. పాఠశాలలకు వేసవి సెలవులు కావడంతో పిల్లలను తీసుకొని తల్లిదండ్రులు స్వగ్రామం పర్రెడ గ్రామానికి మే నెలలో వచ్చారు. అయితే సెలవులు మరికొద్ది రోజుల్లో ముగుస్తుండడంతో విహారయాత్రకు తీసుకెళ్లమని పిల్లలు ముఖేష్, స్వప్న మారం చేశారు. దీంతో చిన్నాన్న సింహాచలం, అత్త లక్ష్మిలు పిల్లల్ని తీసుకొని ఆదివారం ఉదయం ద్విచక్ర వాహనంపై పర్యాటక ప్రాంతానికి వెళ్లారు. అరకులోయలోని పద్మాపురం గార్డెన్, మ్యూజియం చూశారు. తిరిగి ద్విచక్ర వాహనంపై వస్తుండగా గంపరాయి ఘాటీలోని మలుపువద్ద టిప్పర్ వచ్చి వీరి ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘోరంలో పిల్లలు ముఖేష్, స్వప్న సంఘటనా స్థలంలోనే మృతి చెందగా, వాహనం నడుపుతున్న సింహాచలం, వెనుక కూర్చున్న లక్ష్మి స్వల్ప గాయా లతో బయటపడ్డారు. పిల్లల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. శోకసంద్రంలో పర్రెడ : ఇద్దరు పిల్లలు మృత్యువాత పడడంతో పర్రెడ గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. ఆదివారం ఉదయం వరకు అందరితో కలిసి ఆడుకున్న పిల్లలు మృత్యువాత పడడం స్థానికులను కలచివేసింది. రోడ్డు ప్రమాదం బాధాకారం: ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ గంపరాయి ఘాటీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పిల్లలు మృతి చెందడం బాధకరమని అర కు ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ అన్నారు. ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే అధికారులతో మా ట్లాడి కారణాలు అడిగి తెలుసుకున్నారు. మృతి చెందిన పిల్లల తల్లిదండ్రులతో ఫోన్లో మాట్లాడా రు. కుటుంబాన్ని ఆదుకుంటామని భరోసా ఇచ్చా రు. రోడ్డు ప్రమాదాల నివారణ చర్యలు తీసుకోవాలని, మలుపులు, ఘాటీ రోడ్డు వద్ద హెచ్చరి కల బోర్డులు ఏర్పాటుకు సంబంధిత ఆర్అండ్బీ అధికారులతో మాట్లాడుతామన్నారు. మృతుల కుటుంబ సభ్యులను వైఎస్సార్ సీపీ నాయకులు కాతారి సురేష్‌కుమార్ పరామర్శించారు. -
టిప్పర్ క్లీనర్ దుర్మరణం
బనగానపల్లె రూరల్: యాగంటిపల్లె గ్రామ సమీపంలో జీఎన్ఎస్ కాల్వ వద్ద ప్రమాదవశాత్తు టిప్పర్ ఢీకొని క్లీనర్ దుర్మరణం చెందాడు. మండలంలోని మీరాపురం గ్రామానికి చెందిన పాపిరెడ్డి కుమారుడు బత్తుల వెంకట శివారెడ్డి (32) టిప్పర్ క్లీనర్‌గా పని చేస్తున్నారు. మంగళవారం జీఎన్ఎస్ కాల్వ సమీపంలో మట్టిని అన్లోడింగ్ చేస్తుండగా డ్రైవర్ నిర్లక్ష్యంతో టిప్పర్ వెనుక టైర్ల కింద పడి వెంకటశివారెడ్డి అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడికి భార్య శివమ్మ, ఐదేళ్ల కుమారుడు ఉన్నారు. విషయం తెలుసుకున్న బనగానపల్లె ఎస్ఐ రాకేష్ వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని ప్రమాదానికి కారణాలు తెలుసుకున్నారు. పోస్టు మార్టం నిమిత్తం మృతదేహాన్ని బనగానపల్లె ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతుడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
టిప్పర్ నుంచి డీజిల్ చోరీ
అర్వపల్లి: అర్వపల్లి మండల కేంద్రంలోని భారత్ పెట్రోలియం బంక్ పక్కన నిలిపి ఉన్న టిప్పర్ నుంచి గుర్తుతెలియని వ్యక్తులు డీజిల్ చోరీ చేశారు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం....జాజిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన నర్సింగ శ్రీనివాస్‌గౌడ్ తన టిప్పిర్ వాహనాన్ని సోమవారం రాత్రి పెట్రోలియం బంక్ పక్కన పెట్టి వెళ్లాడు. మంగళవారం ఉదయం వచ్చి వాహనాన్ని తీయబోగా స్టార్ట్ కావడం లేదు. అనుమానం వచ్చి టిప్పర్ ట్యాంక్‌ను చూడగా తాళం పగులగొట్టి ఉంది. గుర్తుతెలియని వ్యక్తులు ట్యాంక్ తాళం తీసి అందులోని 85 లీటర్ల డీజిల్‌ను చోరీ చేశారు. ఎస్ఐ ఎ.మోహన్‌రెడ్డి సంఘటన స్థలిని పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. -
మృత్యువులోనూ వీడని స్నేహబంధం
రాంగ్ రూట్లో వెళ్తూ బైక్‌ను ఢీకొన్న టిప్పర్ యువకులు నగరంలో చిరు వ్యాపారులు రాంగ్ రూట్లో వచ్చిన టిప్పర్ ముగ్గురు యువకుల ప్రాణాలను హరించింది. కంచికచర్లలోని పేరకలపాడుకు చెందిన బండి నాగరాజు, బురదగుంట మధు, దోమ కోటేశ్వరరావు బైక్‌పై వెళ్తుండగా పరిటాల వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడ్డారు. వీరు నగరంలోని బీసెంట్‌రోడ్డులో ఫ్యాన్సీ డ్రెస్సుల వ్యాపారం చేస్తుంటారు. ఒకే గ్రామానికి చెందిన ఈ ముగ్గురు స్నేహితులు చిన్నప్పటి నుంచి అన్యోన్యంగా మెలిగారని, మృత్యువులోనూ వీరి స్నేహబంధం వీడిపోలేదని గ్రామస్తులు, కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమవుతున్నారు. కంచికచర్ల : రాంగ్ రూట్లో వెళ్తుతున్న టిప్పర్ బైక్‌ను ఢీకొట్టి ముగ్గురు యువకులను బలితీసుకుంది. ఈ దుర్ఘటన కంచికచర్ల మండలం, పరిటాల వద్ద బుధవారం సాయంత్రం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. కంచికచర్ల మండలం పేరకలపాడు గ్రామానికి చెందిన బండి నాగరాజు (22), బురదగుంట మధు (30), దోమ కోటేశ్వరరావు (తంబి) (23) విజయవాడ బీసెంట్ రోడ్డులో తోపుడుబండ్లపై చిరువ్యాపారం చేసుకుంటూ జీవిస్తున్నారు. ఈ యువకులు బుధవారం ఉదయం ఇబ్రహీంపట్నం లోని తమ బంధువుల ఇంట్లో జరిగిన శుభకార్యానికి బైక్‌పై వెళ్లారు. బంధువులతో కొంతసేపు ఆనందంగా గడిపి అదే బైక్‌పై తిరిగి ఇంటికి బయలుదేరారు. మండలంలోని పరిటాల సమీపంలోని ఆంజనేయస్వామి విగ్రహం సమీపంలో ముందు వెళ్తున్న వాహనాన్ని బైక్ ఓవర్టేక్ చేసే సమయంలో కంచికచర్ల వైపు నుంచి విజయవాడ వైపు రాంగ్ రూట్లో ప్రయాణిస్తున్న దొనబండ పవన్ గ్రానైట్‌కు చెందిన టిప్పర్ బైక్‌ను ఢీకొంది. టిప్పర్ ఆగకుండా కిందపడిన ముగ్గురిపైనుంచి ముందుకు వెళ్లింది తీవ్రంగా గాయపడిన ముగ్గురు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. ఈ ప్రమాదం తరువాత పరారవుతున్న టిప్పర్ డ్రైవర్‌ను సమీపంలోని పొలాల్లో పనిచేస్తున్న వ్యవసాయ కూలీలు పట్టుకుని పోలీస్‌స్టేష న్లో అప్పగించారు. నందిగామ డీఎస్పీ టి.రాధేష్‌మురళీ, రూరల్ సీఐ వై.సత్యకిషోర్, ఎస్ఐ కె. ఈశ్వరరావు, నందిగామ ఆర్టీవో సురేష్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. వృుతదేహాలను పోస్టుమార్టం కోసం నందిగామ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలిం చారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న కుటుంబ సభ్యులు శుభకార్యానికి వెళ్లి వస్తున్న నాగరాజు, కోటేశ్వరరావు, మధును టిప్పర్ రూపంలో వృుత్యువు కాటేసిందని తెలియడంతో వారి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
లారీని ఢీకొన్న టిప్పర్
సామర్లకోట : సామర్లకోట-కాకినాడ కెనాల్ రోడ్డు రైల్వే గేటు సమీపంలో రోడ్డుపై నిలిచి ఉన్న లారీని వెనుక నుంచి వ చ్చిన టిప్పర్ ఢీ కొంది. పోలీసుల కథనం ప్రకారం కంకర రాళ్లను తీసుకు వె ళుతున్న లారీ యాక్సిల్ విరిగిపోవడంతో డ్రైవర్ రోడ్డుపై నిలిపి వేవాడు. శుక్రవారం తెల్లవారు జామున పెద్దాపురం నుంచి కాకినాడ వెళుతున్న గ్రావెల్ లోడ్ టిప్పర్ నిలిచి ఉన్న లారీని గమనించకపోవడంతో వెనుక నుంచి ఢీకొట్టింది. టిప్పర్‌లో ఉన్న డ్రైవర్, క్లీనర్లకు తీవ్రగాయాలయ్యాయి. వారిని స్థానికులు 108లో కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విషయం తెలుసుకున్న పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. బీహార్ రాష్ట్రం నుంచి వచ్చిన లారీ డ్రైవర్ జబులస్ అసాద్, క్లీనర్ ముకేష్ అసాద్లు పెద్దాపురం మండలం సూరంపాలెంలో ఒక ప్రైవేటు కంపెనీలోని టిప్పర్‌లో పని చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. క్లీనర్ పరిస్థితి విషమంగా ఉందన్నారు. ఏఎస్సై జీవీవీ సత్యనారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఉదయం 11 గంటల ప్రాంతంలో రోడ్డుపై నిలిచిపోయిన వాహనాలను పక్కకు తొలగించారు. టిప్పర్ల వేగం కారణంగా వరుసగా మూడు రోజులుగా రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఒక ప్రమాదంలో కోరంగి ఎస్సై మృతి చెందగా, మరో రోజు 108 పాడైపోయింది. శుక్రవారం లారీని టిప్పర్ ఢీకొంది. ఈ వరుస ఘటనలతో ప్రయాణికులు బెంబేలెత్తిపోతున్నారు. -
టిప్పర్ ఢీకొని ఎస్సై దుర్మరణం
కాకినాడ క్రైం : విధి నిర్వహణలో భాగంగా కేసు దర్యాప్తు చేసేందుకు వెళ్లి, మోటార్‌బైక్‌పై తిరిగిగొస్తున్న ఎస్సై ఆనంద్‌కుమార్‌ను టిప్పర్ ఢీకొట్టడంతో దుర్మరణం పాలయ్యారు. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు వెంకటాపురం హనుమాన్ నగర్‌కు చెందిన రాచర్ల ఆనంద్‌కుమార్(38) ఎస్సైగా 2002 బ్యాచ్‌లో ఎంపికయ్యారు. హైదరాబాద్‌లో శిక్షణ పొందిన ఆయన కొంతకాలం అక్కడే విధులు నిర్వహించారు. కాకినాడ రూరల్ మండలం సర్పవరం పోలీస్‌స్టేషన్‌లో ప్రొబెషనరీ ఎస్సైగా ఐదు నెలల పాటు పనిచేశారు. అనంతరం ఉప్పలగుప్తం ఎస్సైగా రెండేళ్లు, విజయవాడ టూ టౌన్ ఎస్సైగా ఎక్కువ కాలం పనిచేశారు. మూడు నెలల క్రితం కోరంగి ఎస్సైగా ఇక్కడికి వచ్చారు. ప్రస్తుతం ఆయన కాకినాడ సురేష్‌నగర్ పార్కు ఎదురుగా అద్దె ఇంట్లో ఉంటున్నారు. విధి నిర్వహణలో భాగంగా మంగళవారం ఆయన మోటార్ బైక్‌పై మరో ప్రాంతానికి వెళ్లారు. అర్థరాత్రి ఇంటికి తిరిగి వస్తుండగా, సామర్లకోట రూరల్ మండలం కొప్పవరం జంక్షన్ వద్ద వెనుక నుంచి టిప్పర్ ఢీకొంది. ఎస్సై ఆనంద్‌కుమార్ పొట్టపై నుంచి టిప్పర్ చక్రాలు దూసుకెళ్లడంతో ఆయన అక్కడికక్కడే మరణించారు. ఆయనతో పాటు చందమామ రెస్టారెంట్ రాజు కూడా మోటార్ బైక్‌పై ఉన్నారు. ప్రమాదంలో రాజుకు స్వల్ప గాయాలయ్యాయి. తిమ్మాపురం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు ఆనంద్‌కుమార్‌కు భార్య ఝాన్సీలక్ష్మి, తొమ్మిదేళ్ల కుమార్తె సంజన, నాలుగేళ్ల కుమారుడు రిషీ ఉన్నారు. ఎస్సై ఆనంద్‌కుమార్ భౌతికకాయాన్ని ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, జెడ్పీ చైర్మన్ నామన రాంబాబు, కలెక్టర్ అరుణ్‌కుమార్, ఎస్పీ ఎం. రవిప్రకాష్, ఇతర అధికారులు సందర్శించి నివాళులర్పించారు. పోస్ట్‌మార్టం అనంతరం మృతదేహాన్ని ఆనంద్‌కుమార్ స్వగ్రామానికి తరలించారు. ఎస్సై మృతితో విషాదఛాయలు తాళ్లరేవు : కోరంగి ఎస్సై రాచర్ల ఆనంద్ కుమార్ మృతితో జిల్లాలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఇక్కడ మూడేళ్ల పాటు ఎస్సైగా విశేష సేవలందించిన ఆనంద్‌కుమార్ సిన్సియర్ అధికారిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఉప్పలగుప్తం మండలంలోరెండున్నరేళ్ల పాటు పనిచేశారు. ఈ ఏడాది ఏప్రిల్ 9న కోరంగి ఎస్సైగా బాధ్యతలు చేపట్టారు. కేవలం రెండున్నర నెలల్లోనే అక్రమ వ్యాపారాలను, నేరాల సంఖ్యను అదుపు చేశారు. అనతికాలంలోనే అందరి మన్ననలు పొందారు. ఇంతలోనే ఆయన మరణించడాన్ని ప్రజలు, సహచర సిబ్బంది జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన మరణ వార్త తెలిసి అనేక మంది అధికారులు, నాయకులు, సహచరులు కాకినాడ ప్రభుత్వాస్పత్రికి వెళ్లి ఆనంద్‌కుమార్ భౌతికకాయానికి నివాళులర్పించారు. పదోన్నతి రాకుండానే.. మరో రెండు నెలల్లో ఆనంద్‌కుమార్‌కు సీఐగా పదోన్నతి రానున్నట్టు ఇటీవల తెలిసింది. పదోన్నతి అందుకోకుండానే ఆయన మరణించడంతో స్టేషన్ సిబ్బంది విచారం వ్యక్తం చేస్తున్నారు. నిరంతరం పోలీస్‌స్టేషన్‌కు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో స్టేషన్‌కు సమీపంలోని సురేష్ నగర్లో ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నారు. కోరంగి సొసైటీ అధ్యక్షుడు కొప్పిశెట్టి లక్ష్మయ్య ఇంట్లో వెళ్లేందుకు రెండు రోజుల క్రితం పాలు పొంగించారు. విధి నిర్వహణే ఊపిరిగా ఆనంద్‌కుమార్ ఉండేవారని కానిస్టేబుల్ శ్రీను చెప్పారు. నిరంతరం స్టేషన్లో అందుబాటులో ఉంటూ, సమస్యల పరిష్కారానికి అత్యధిక సమయం కేటాయించేవారన్నారు. ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన అనతికాలంలోనే నేరాలను అదుపు చేశారని సుంకరపాలేనికి చెందిన చీకట్ల నాగేశ్వరరావు అన్నారు. ముఖ్యంగా ఇసుక అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకున్నారన్నారు. -
టిప్పర్‌కు విద్యుత్ సరఫరా.. ..డ్రైవర్ దుర్మరణం...
కుక్కునూరు, న్యూస్‌లైన్ : రోడ్డు విస్తరణలో పనులు నిర్వహిస్తున్న ఓ టిప్పర్‌కు విద్యుత్ వైర్లు తగిలి విద్యుదాఘాతంతో డ్రైవర్ మృతి చెందిన సంఘటన ఖమ్మంజిల్లా కుక్కునూరు మండలం లంకాలపల్లిలో గురువారం చోటు చేసుకుంది. పోలీసుల సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. వరంగల్ జిల్లా మంగపేట మండలం కమలాపురం గ్రామానికి చెందిన కఠారి నాంచారయ్య(50) కుక్కునూరు మండలంలో జరుగుతున్న రోడ్డు విస్తరణ పనుల్లో పాల్గొంటున్నాడు. మూడు నెలలుగా అతను టిప్పర్ డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. గురువారం మెటల్ తీసుకువచ్చి మండలంలోని లంకాలపల్లి వద్ద టిప్పర్ ట్రక్కు పైకి ఎత్తి అన్లోడ్ చేస్తున్న క్రమంలో పైన ఉన్న 11 కేవీ విద్యుత్ వైర్లు తగిలాయి. దీంతో మంటలు చెలరేగి టిప్పర్ టైర్లు దగ్ధమయ్యాయి. ఈ సంఘటనతో భయకంపితుడైన డ్రైవర్ కిందికి దిగేందుకు కాలు కిందపెట్టగానే ఎర్త్ అయి విద్యుదాఘాతంతో అక్కడిక్కడే మృతి చెందాడు. టిప్పర్ ట్రక్కు తగిలి విద్యుత్ వైర్లు తెగి కిందపడ్డాయి. ఈ విషయం తెలుసుకున్న హెడ్ కానిస్టేబుల్ సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.