టిప్పర్‌కు విద్యుత్ సరఫరా.. ..డ్రైవర్ దుర్మరణం...
Published Fri, Oct 4 2013 2:07 AM | Last Updated on Sat, Sep 29 2018 5:29 PM
కుక్కునూరు, న్యూస్‌లైన్ : రోడ్డు విస్తరణలో పనులు నిర్వహిస్తున్న ఓ టిప్పర్‌కు విద్యుత్ వైర్లు తగిలి విద్యుదాఘాతంతో డ్రైవర్ మృతి చెందిన సంఘటన ఖమ్మంజిల్లా కుక్కునూరు మండలం లంకాలపల్లిలో గురువారం చోటు చేసుకుంది. పోలీసుల సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. వరంగల్ జిల్లా మంగపేట మండలం కమలాపురం గ్రామానికి చెందిన కఠారి నాంచారయ్య(50) కుక్కునూరు మండలంలో జరుగుతున్న రోడ్డు విస్తరణ పనుల్లో పాల్గొంటున్నాడు.
మూడు నెలలుగా అతను టిప్పర్ డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. గురువారం మెటల్ తీసుకువచ్చి మండలంలోని లంకాలపల్లి వద్ద టిప్పర్ ట్రక్కు పైకి ఎత్తి అన్‌లోడ్ చేస్తున్న క్రమంలో పైన ఉన్న 11 కేవీ విద్యుత్ వైర్లు తగిలాయి. దీంతో మంటలు చెలరేగి టిప్పర్ టైర్లు దగ్ధమయ్యాయి. ఈ సంఘటనతో భయకంపితుడైన డ్రైవర్ కిందికి దిగేందుకు కాలు కిందపెట్టగానే ఎర్త్ అయి విద్యుదాఘాతంతో అక్కడిక్కడే మృతి చెందాడు. టిప్పర్ ట్రక్కు తగిలి విద్యుత్ వైర్లు తెగి కిందపడ్డాయి. ఈ విషయం తెలుసుకున్న హెడ్ కానిస్టేబుల్ సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.
Advertisement
Advertisement