
బాబోయ్.. బర్డ్ ఫ్లూ!
నేటి నుంచి బ్రహ్మోత్సవాలు దూల్మిట్ట మండలం బెక్కల్‌లోని రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు గురువారం నుంచి జరగనున్నాయి. వివరాలు 8లో u
బుధవారం శ్రీ 12 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): జిల్లాలో పౌల్ట్రీ ఫామ్స్ అతిపెద్ద ఉపాధి కల్పన పరిశ్రమగా రూపాంతరం చెందింది. ఇక్కడి నుంచి కోడిగుడ్లు, కోళ్లు రాష్ట్రంలోని ఇతర జిల్లాలతో పాటు, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్, పశ్చిమబెంగాల్ తదితర రాష్ట్రాలకు సరఫరా అవుతుంటాయి. దీంతో ఎంతో మంది ఉపాధి పొందుతున్నారు. ఇదిలా ఉంటే బర్డ్ ఫ్లూ వార్తల నేపథ్యంలో జిల్లా వాసులు చికెన్, కోడిగుడ్లు అంటేనే భయపడుతున్నారు. చికెన్ తినడం వల్ల బర్డ్ ఫ్లూ వ్యాపిస్తుందనే భయంతో వారంలో నాలుగు రోజులు తినే వారు సైతం చికెన్ వైపు చూడటంలేదు. దీంతో వ్యాపారం మందగించడంతో చికెన్ సెంటర్ల నిర్వాహకులు, కోడిగుడ్ల వ్యాపారులు ఆందోళనకు గురవుతున్నారు.
సోషల్ మీడియాలో హల్‌చల్
బర్డ్‌ఫ్లూ విస్తృతంగా వ్యాప్తిస్తోందని, చికెన్, కోడిగుడ్లు తినవద్దని రాష్ట్ర స్థాయి అధికారులు ప్రకటనలు విడుదల చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. దీంతో చికెన్ ప్రియులు మరింత ఆందోళన చెందుతున్నారు.
న్యూస్‌రీల్
బర్డ్ ఫ్లూ భయం జిల్లా వాసులను వణికిస్తోంది. రాష్ట్రంలోనే అత్యధిక పౌల్ట్రీ ఫామ్‌లు ఉన్న జిల్లాగా సిద్దిపేట పేరుగాంచింది. జిల్లాలో 60కిపైగా లేయర్, 175పైగా బాయిలర్ పౌల్ట్రీ ఫామ్‌లు ఉన్నాయి. వాటిల్లో రోజుకు 50 లక్షల వరకు గుడ్లు ఉత్పత్తి అవుతండగా, 92లక్షల వరకు కోళ్లు ఉన్నాయి. మరోవైపు ఉమ్మడి నిజామాబాద్, ఖమ్మం జిల్లాల్లో వివిధ కారణాల చేత కోళ్లు మృత్యువాత పడుతుండటంతో జిల్లాలోని ఫాల్ట్రీ ఫామ్‌ల నిర్వాహకులు ఆందోళనకు గురవుతున్నారు.
లేయర్(గుడ్లు) పౌల్ట్రీ ఫామ్‌లు: 60
బాయిలర్ (చికెన్)
పౌల్ట్రీ ఫామ్‌లు:
175
సుమారు కోళ్ల సంఖ్య:
92
లక్షలు

బాబోయ్.. బర్డ్ ఫ్లూ!
Comments
Please login to add a commentAdd a comment