
రైతులను భాగస్వామ్యం చేయండి
వ్యవసాయశాఖ అధికారికి ఏఈఓల వినతి
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): కేంద్ర ప్రభుత్వం చేపట్టిన డిజిటల్ సర్వే ప్రక్రియలో రైతులను భాగస్వామ్యం చేయాలని ఏఈఓలు కోరారు. ఈ మేరకు బుధవారం జిల్లా వ్యవసాయశాఖ అధికారి రాధికకు వినతి పత్రం అందించారు. అనంతరం ఏఈఓలు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిబంధనలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చెప్పే ప్రతి పనిని చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. కానీ డిజిటల్ సర్వేకు వెళ్లినప్పుడు రైతులు లేకపోవడంతో సర్వే నెంబర్లలో పంటలను గుర్తించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. ఏఈఓలకు డివైజ్‌లను అందించి యాప్ ల ద్వారా పనులు చేసేలా కృషి చేయాలన్నారు. పంట చేనుల వద్దకు వెళ్ళినప్పుడు రైతులు ఉండేలా ఏర్పాటు చేయాలన్నారు. ముఖ్యంగా మహిళా ఏఈవోలు పంట చేనుల వద్దకు వెళ్లి నప్పుడు, రైతులు, ఇతర సహాయ సిబ్బంది ఎవరూ లేకపోవడంతో సమస్యలు ఎదురవుతున్నాయని తెలిపారు. మహిళా ఏఈఓలకు భద్రత కల్పించేలా చర్యలు చేపడుతూ, రైతులతో పాటు వివిధ శాఖల నుంచి సహాయ సహకారాలు అందించాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment