అభివృద్ధికి సహకరించండి గజ్వేల్‌రూరల్: వ్యాపారులు, గృహ
మూడు గంటలకే
ఆస్పత్రికి తాళం
సిబ్బంది ఇష్టారాజ్యం
కోహెడరూరల్(హుస్నాబాద్): మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. 3 గంటలకే ఆస్పత్రిని మూసివేస్తున్నారు. రోజూ సమయపాలన పాటించకపోడంతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చే రోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. బుధవారం మండంలోని తంగళ్ళపల్లి శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చికిత్స కోసం వెళ్లాడు. ఆస్పత్రి మూసి ఉండటంతో చేసేదిలేక ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. రోజూ ఆరోగ్య కేంద్రంలో వైద్యులు సరైన సమయానికి రాకపోవడంతో రోగులు గంటల కొద్దీ పడిగాపులు పడుతున్నారు. ఈ విషయంపై వైద్యురాలు నిమ్రాని వివరణ కోరగా ‘సిబ్బంది సరిపడా లేరు. మమ్మల్ని ఏం చేయమంటారు. మంత్రి పొన్నం దృష్టికి తీసుకెళ్లాం. ఆయన పట్టించుకోవడంలేదు’ అంటూ సమాధానం ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment