
విధి నిర్వహణలో నిర్లక్ష్యం తగదు
డిప్యూటీ డీఎంహెచ్‌ఓ ఆనంద్
కోహెడరూరల్(హుస్నాబాద్): సాక్షి దినపత్రికలో ఈ నెల 13న ‘మూడు గంటలకే ఆస్పత్రికి తాళం’.. సిబ్బంది ఇష్టారాజ్యం అనే శీర్షికన ప్రచురితమైన కథనానికి డిప్యూటీ డీఎంహెచ్‌ఓ ఆనంద్ స్పందించారు. ఈమేరకు శుక్రవారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా సిబ్బందితో మాట్లాడుతూ విధి నిర్వహణలో నిర్లక్ష్యం ఉంటే చర్యలు తీసుకుంటామన్నారు. 24గంటలు అందుబాటులో గ్రామీణ ప్రజలకు వైద్యసేవలను అందించాలన్నారు. అదేవిధంగా సమయపాలన పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి నిమ్రాని, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
‘పార్టీలు వేరైనా
రైతులంతా ఒక్కటే ’
మిరుదొడ్డి(దుబ్బాక): రాజకీయ పార్టీలు వేరైనా రైతులంతా ఒక్కటేనని భారతీయ కిసాన్ సంఘ్ జిల్లా అధ్యక్షుడు కూరెల్లి జస్వంత్‌రెడ్డి అన్నారు. భారతీయ కిసాన్ సంఘ్ రాష్ట్ర కార్యవర్గం ఆదేశాల మేరకు సేంద్రియ వ్యవసాయ ప్రముఖ్ సత్తు రాజిరెడ్డి ఆధ్వర్యంలో, మండల అధ్యక్షుడు వజ్జపల్లి రాజేశ్వర్ అధ్యక్షతన శుక్రవారం మిరుదొడ్డిలో జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. జిల్లాలో సాగు నీరు, విద్యుత్, రెవెన్యూ సమస్యలు, నకిలీ విత్తనాలు, ఎరువులు, విత్తనాల అధిక ధరల అమ్మకం వంటి అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు ఎదుర్కొటున్న సమస్యలపై ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు. అందుకు గ్రామ స్థాయిలో రైతు కమిటీలను ఏర్పాటు చేసి సమస్యలకు పరిష్కారం వైపు అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు నగేష్, జిల్లా కార్యదర్శి చెంద్రాగౌడ్ రైతులు పాల్గొన్నారు.
కేసీఆర్ కృషి వల్లేగ్రీనరీలో నంబర్‌వన్
గజ్వేల్: కేసీఆర్ కృషి వల్ల గ్రీనరీలో దేశంలోనే తెలంగాణ నంబర్‌వన్‌గా ఆవిర్భవించిందని ఎఫ్‌డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి అన్నారు. ఫిబ్రవరి 17 కేసీఆర్ జన్మదినం సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ నినాదంతో బీఆర్‌ఎస్ నేత జోగినిపల్లి సంతోష్‌కుమార్ నేతృత్వంలో రాష్ట్రవ్యాప్తంగా చేపట్టనున్న వృక్షార్చన కార్యక్రమం చేపట్టడానికి నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన వాల్‌పోస్టర్లను శుక్రవారం గజ్వేల్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ హయాంలో ‘హరిత హారం’ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టడం వల్ల మంచి ఫలితాలు వచ్చాయన్నారు. జన్మదినం రోజున కేసీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో సైతం మొక్కలు నాటే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపడతామన్నారు. మున్సిపల్ మాజీ చైర్మన్ ఎన్‌సీ రాజమౌళి, బీఆర్‌ఎస్ గజ్వేల్ పట్టణ శాఖ అధ్యక్షులు నవాజ్‌మీరా, ఆత్మ కమిటీ మాజీ చైర్మన్ ఊడెం కృష్ణారెడ్డి, నాయకులు పాల్గొన్నారు.

విధి నిర్వహణలో నిర్లక్ష్యం తగదు

విధి నిర్వహణలో నిర్లక్ష్యం తగదు
Comments
Please login to add a commentAdd a comment