
గురి తప్పొద్దు.. ఆత్మవిశ్వాసం వీడొద్దు
పోలీస్ ఫైరింగ్ ప్రాక్టీస్‌ను పరిశీలించిన సీపీ
నంగునూరు(సిద్దిపేట): శిక్షణతో ఆత్మవిశ్వాసం పెరగడంతో పాటు స్కిల్ డెవలప్‌మెంట్ అలవడుతుందని పోలీస్ కమిషనర్ అనురాధ అన్నారు. రాజగోపాల్‌పేటలో పోలీసు సిబ్బందికి నిర్వహిస్తున్న ఫైరింగ్ శిక్షణను శుక్రవారం సీపీ తనిఖీ చేశారు. ఏఆర్ అదనపు డీసీపీ సుభాష్‌చంద్రబోస్, ఏసీపీలు మధు, సతీష్, పురుషోత్తంరెడ్డి, సువన్‌కుమార్, రవీందర్‌రెడ్డి ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఎలాంటి ఆయుధాలు లేకుండా సమీపం నుంచి ముష్కరులను ఎదుర్కోవడం, స్కిల్ డెవలప్‌మెంట్, వివిధ ఆయుధాలతో ఫైరింగ్ చేయడంపై శిక్షణ ఇచ్చారు. కమిషనర్ సైతం ఎంపీ 5 పిస్తల్, గ్లాక్ వెపన్‌తో ఫైరింగ్ చేశారు. ఈ సందర్భంగా అనురాధ మాట్లాడుతూ శిక్షణ ద్వారా నైపుణ్యం, ఆలోచన విధానం, ఆత్మస్థైర్యం పెరుగుతుందన్నారు. పోలీసులు అన్ని రకాల ఆయుధాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. ఫైరింగ్‌లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన సిబ్బందికి అవార్డులు, రివార్డులు అందజేస్తామని చెప్పారు. కార్యక్రమంలో ఆర్‌ఐలు, సీఐలు, ఎస్‌ఐలు, పోలీసులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment