మా భూముల జోలికి రావొద్దు
సిద్దిపేటజోన్: ‘మా బతుకేంగావాలి’ అని గురువారం సాక్షిలో ప్రచురించిన కథనం రైతులను కదిలించింది. వివిధ గ్రామాల రైతులు జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయానికి చేరుకుని నిరసన వ్యక్తం చేశారు. జాతీయ రహదారి నిర్మాణం పేరిట మా భూముల జోలికి రావొద్దని, ఇప్పటికే వివిధ పథకాలకు భూములు ఇచ్చామని, మళ్ళీ ఇవ్వలేమని రైతులు స్పష్టం చేశారు. గురువారం దుద్దెడ, మర్పడగ, తడ్కపల్లి, బురుగుపల్లి, పుల్లూర్ తదితర గ్రామాల రైతులు ఆర్డీఓ కార్యాలయానికి చేరుకున్నారు. జాతీయ రహదారి నిర్మాణం కోసం మా భూముల జోలికి రావొద్దని వేడుకొన్నారు. సర్వే అధికారులను అడ్డుకుంటామని హెచ్చరించారు. ఒకదశలో ఆర్డీఓ ప్రధాన ద్వారం వద్ద కొద్దిసేపు రైతులు నిరసన వ్యక్తం చేశారు. సన్నకారు రైతుల భూములను లక్కోవడం సరికాదని ఆవేదన వ్యక్తంచేశారు.
సర్వేను అడ్డుకుంటాం
ఆర్డీఓ కార్యాలయం ఎదుట
రైతుల నిరసన
కదిలించిన సాక్షి కథనం
Comments
Please login to add a commentAdd a comment