ప్రైవేటు ఆస్పత్రుల్లో నిబంధనలు తప్పనిసరి
ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ ఆనంద్
సిద్దిపేటకమాన్: పైవేటు ఆస్పత్రులు నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలని ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ ఆనంద్ తెలిపారు. పట్టణంలోని పలు ప్రైవేటు ఆస్పత్రులను వైద్యాధికారులు తనిఖీలు నిర్వహించారు. డాక్టర్ ఆనంద్ మాట్లాడుతూ.. ఆస్పత్రుల్లో ధరల పట్టిక బోర్డులు ఏర్పాటు చేయాలని, అనవసర పరీక్షలు చేయకూడదని తెలిపారు. పేషెంట్ల నుంచి అధిక ఫీజులు వసూలు చేయరాదని హెచ్చరించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే ప్రైవేటు ఆస్పత్రులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆస్పత్రుల యాజమాన్యాలు నూతన రిజిస్ట్రేషన్, రెన్యువల్ చేసుకునేందుకు డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో సంప్రదించాలని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment