భయం వీడితేనే పరీక్షల్లో జయం
తొగుట(దుబ్బాక): పరీక్షలంటే భయపడకుండా ప్రశాంతంగా రాయాలని, అప్పుడే విజయం సాధిస్తామని అదనపు కలెక్టర్ గరిమఅగర్వాల్ విద్యార్థులకు సూచించారు. మండలంలోని రాంపురం సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలను గురువారం సందర్శించారు. పదో తరగతి, ఇంటర్ విద్యార్థినులతో మాట్లాడారు. ఈ సందర్భంగా వార్షిక పరీక్షలపై పలు సూచనలు చేశారు. ఆమె మాట్లాడుతూ పరీక్షలంటే సహజంగానే భయం ఉంటుందని, అనవసర భయాందోళకు గురికాకుండా ప్రశాంతంగా రాసి ఉత్తమ ఫలితాలు సాధించాలని సూచించారు. క్రమపద్ధతిలో చదువుకుని మంచి మార్కులు సాధించాలని కోరారు. మెనూ ప్రకారంగా విద్యార్థులకు పౌష్టికాహరం అందించాలని ప్రిన్సిపాల్‌ను ఆదేశించారు. భోజనంలో గుడ్లు, క్యారెట్, బీట్రూట్ వంటివి తప్పనిసరిగా అందిచాలని సూచించారు. అనంతరం హాస్టల్ గుదులు, డైనింగ్ హాల్ పరిశీలించారు. విద్యార్థినులతో కలిసి మధ్యాహ్న భోజంచేశారు. అనంతరం స్థానిక పీహెచ్‌సీని సందర్శించారు. కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీకాంత్, ఎంపీడీఓ శ్రీనివాస్‌రెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
అదనపు కలెక్టర్ గరిమ అగర్వాల్
Comments
Please login to add a commentAdd a comment