ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ పనులు వేగిరం చేయండి
కలెక్టర్ మనుచౌదరి
నంగునూరు(సిద్దిపేట): నర్మేటలో నిర్మిస్తున్న ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీని జూన్ మొదటి వారంలోగా పూర్తి చేసి అందుబాటు లోకి తేవాలని కలెక్టర్ మనుచౌదరి అఽధికారులను ఆదేశించారు. నర్మేటలో నిర్మిస్తున్న ఫ్యాక్టరీ పనులను గురువారం అధికారులతో కలసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నిర్మాణ పనులపై ఆరా తీశారు. ఫ్రేష్ ప్రూట్ బంచెస్, ప్రాసెసింగ్ షెడ్, బ్రాయిలర్‌ను మే నెలాఖరు వరకు పూర్తి చేయాలన్నారు. సివిల్, మెకానికల్ పనులు, పవర్ ప్లాంట్ నిర్మాణం పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని ఆయిల్‌ఫెడ్ మేనేజర్ శ్రీకాంత్‌రెడ్డి, నిర్మాణ సంస్థ సైట్ మెనేజర్లను ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా హార్టికల్చర్, సెరీకల్చర్ అధికారి సువర్ణ, తహసీల్దార్ సరిత, ఎంపీడీఓ లక్ష్మణప్ప అధికారులు పాల్గొన్నారు.
బాలికల భద్రతకు ప్రాధాన్యం
బాలికల పౌష్టికాహారం అందించడంతో పాటు భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్ మనుచౌదరి అధికారులను ఆదేశించారు. గురువారం గట్లమల్యాల లోని బాలికల హాస్టల్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. డార్మెటరీ, వంట గది, హాస్టల్‌లో నిల్వ ఉన్న సరుకులను పరిశీలించారు. విద్యార్థినులకు అందజేస్తున్న మెనూ వివరాలను అడిగి తెలుసుకున్నారు. బాత్‌రూంకు డోర్లు లేకపోవడంతో హాస్టల్ వెల్ఫేర్ అధికారి మాధవిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణం డోర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా ఎస్సీ హాస్టళ్లలో వంట సరుకుల సరఫరాలో సమస్యలు, అల్పాహారం వండేందుకు వంట పాత్రలు లేకుంటే ప్రతిపాదనలు పంపాలని జిల్లా ఇన్‌చార్జి ఎస్సీ హాస్టల్ వెల్ఫేర్ అధికారి హమీద్‌కు సూచించారు. ఆయన వెంట తహసీల్దార్ సరిత, ఎంపీడీఓ లక్ష్మణప్ప తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment