కొత్త మెనూ ప్రకారమే భోజనం
● కలెక్టర్ మనుచౌదరి ● గజ్వేల్‌లోని గురుకుల బాలికల పాఠశాల సందర్శన
గజ్వేల్‌రూరల్: గురుకులంలోని విద్యార్థినులకు కొత్త డైట్ మెనూ ప్రకారమే భోజనం అందించాలని కలెక్టర్ మను చౌదరి స్పష్టం చేశారు. సౌకర్యాల విషయంలో ఎక్కడా రాజీపడొద్దని, సామగ్రి దొరకలేదని సాకులు చెబితే చర్యలు తప్పవని హెచ్చరించారు. గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రజ్ఞాపూర్ శివారులో పాతూరు చౌరస్తా వద్దగల మహాత్మా జ్యోతిబాపూలే బాలికల గురుకుల పాఠశాలను కలెక్టర్ శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఇంటర్ ఫస్టియర్ బైపీసీ విద్యార్థులతో మాట్లాడారు. పరీక్షలు సమీపిస్తున్నందున సమయాన్ని వృథా చేయవద్దని, కష్టపడి చదువుతూ పరీక్షల్లో మంచి ఫలితాలను సాధించాలని సూచించారు. అనంతరం గురుకులంలోని విద్యార్థుల సంఖ్య, వారికి అందిస్తున్న సదుపాయాలు, సౌకర్యాలపై ఆరా తీశారు. వంట సామగ్రి, డార్మెటరీలో మరమ్మతులు చేయాల్సి ఉందని ఆ పాఠశాల ప్రిన్సిపాల్ తస్లిమా సుల్తానా కలెక్టర్ దృష్టికి తీసుకురాగా సౌకర్యాలను కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో తహాసీల్దార్ శ్రావణ్, ఎంపీడీవో ప్రవీణ్, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment