ప్రజల చూపు బీజేపీ వైపు
● కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లపై నమ్మకం పోయింది ● చేవెళ్ల ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డి
సిద్దిపేటజోన్: రాష్ట్ర ప్రజలు ప్రస్తుతం బీజేపీ వైపు చూస్తున్నారని, కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలపై నమ్మకం పోయిందని చేవెళ్ల ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. మంగళవారం సిద్దిపేటలో ఆయన విలేకరులతో మాట్లాడారు. బడ్జెట్, ఇటీవల వివిధ రాష్ట్రాల ఫలితాలు, అంతర్జాతీయ స్థాయిలో దేశ ప్రతిష్ట తదితర కారణాల వల్ల దేశంలో ప్రధాని నరేంద్రమోదీ మీద నమ్మకం మరింత పెరిగిందన్నారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం దివాళా తీసిందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ నిధులను వాడుకోలేక నిర్వీర్యం చేస్తోందని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. సమావేశంలో రంగారెడ్డి జిల్లా మాజీ ఎమ్మెల్యే రత్నం, సిద్దిపేట జిల్లా బీజేపీ అధ్యక్షుడు మోహన్ రెడ్డి, సీనియర్ నాయకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment