తాగునీటి సరఫరాలో అంతరాయం రానివ్వం
కలెక్టర్ మిక్కిలినేని మనుచౌదరి
సిద్దిపేటరూరల్: జిల్లాలో తాగునీటికి, విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చర్యలు చేపడుతున్నట్లు కలెక్టర్ మిక్కిలినేని మనుచౌదరి తెలిపారు. మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి శాంతకుమారి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వ్యవసాయ రంగానికి, తాగునీటికి అంతరాయం లేకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అలాగే విద్యుత్ వినియోగంపై అధికారులతో సమీక్షిస్తూ అవసరమైన చర్యలు చేపడుతున్నామని తెలిపారు. రైతు భరోసా అర్హులకు అందేలా చర్యలు తీసుకోవడంతో పాటుగా, రేషన్‌కార్డులకై వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్హులకు అందిస్తామన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్లు గరిమా అగర్వాల్, అబ్దుల్ హమీద్, ఆర్డీవోలు వివిధ శాఖల అధికారుల తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment