సేవాలాల్ మార్గం.. బంజారాల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్
దూర విద్యను
దగ్గరకు చేర్చింది
సిద్దిపేటఎడ్యుకేషన్: దూర విద్యను డిజిటల్‌గా మార్చి దగ్గరకు చేర్చిన ఘనత బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీకే దక్కిందని రిజిస్ట్రార్ డాక్టర్ విజయకృష్ణారెడ్డి అన్నారు. స్టూడెంట్ సర్వీస్ సెల్ డైరెక్టర్ వెంకటేశ్వర్లుతో కలిసి ఆదివారం ఓపెన్ యూనివర్సిటీ సిద్దిపేట స్టడీ సెంటర్‌ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా రిజిస్ట్రార్ మాట్లాడుతూ అపార్ నమోదులో దేశంలోనే అంబేడ్కర్ యూనివర్సిటీ ముందుందన్నారు. ముఖ్యంగా యువత డ్రగ్స్ వైపునకు మరలకుండా వారిలో చైతన్యాన్ని తీసుకురావాలన్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు కౌన్సిలర్లు నిబద్ధతతో పనిచేయాలని సూచించారు. త్వరలోనే సిద్దిపేట స్టడీ సెంటర్‌కు ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్‌ను మంజూరు చేయనున్నట్లు చెప్పారు. పూర్వవిద్యార్థుల ఆత్మీయ సమేళనానికి శ్రీకారం చుట్టిన స్టడీ సెంటర్ రీజనల్ కోఆర్డినేటర్ డాక్టర్ శ్రద్ధానందంను అభినందించారు. కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది ఎల్లం, రాజు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment