
దేవుడు వరమిచ్చినా.. పూజారి కరుణించలేదన్నట్లు తయారైంది జ
ఏడాది గడుస్తున్నా
పెండింగ్‌లోనే బిల్లులు
● ఒత్తిడిలో గ్రామ కార్యదర్శులు
● సమస్యలు పరిష్కరించాలంటూ వేడుకోలు
దుబ్బాకటౌన్: గ్రామ పంచాయతీల్లో నిధులు లేక నానావస్థలు పడుతున్నామని, నిర్వహణ చేయలేక తమ పరిస్థితి అగమ్యగోచరంగా మారుతోందని కార్యదర్శులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సిద్దిపేట జిల్లాలో 499 పంచాయతీలు ఉన్నాయి. గత ఏడాది ఆగస్టు నుంచి పంచాయతీ నిర్వహణ ఖర్చులకు సంబంధించిన చెక్కులు ఇప్పటికీ చెల్లించలేదు. పైగా వాటిని ప్రభుత్వం పెండింగ్‌లో ఉంచింది. దీంతో ప్రతి పనికి తీవ్ర ఇబ్బందులు తప్పడంలేదని కార్యదర్శులు వాపోతున్నారు. గ్రామ పంచాయతీకి రోజువారీ అవసరాలైన పారిశుద్ధ్యం, ట్రాక్టర్‌కు డీజిల్, వీఽధిదీపాలు, మోటార్ మరమ్మతుల నిర్వహణ, కనీసం బ్లీచింగ్ ఫౌడర్ కొనేందుకు కూడా చాలా పంచాయతీల్లో ఒక్క రూపాయి కూడా లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నిధులు విడుదల చేయని ప్రభుత్వం
గత వేసవిలో గ్రామస్థాయిలో నీటి సరఫరా కోసం స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. అయితే కార్యదర్శులు అనేక కష్టాలు పడి నీటి సరఫరా సజావుగా సాగించేలా కృషి చేశారు. ఇప్పటి వరకు ఆ బిల్లు లను ప్రభుత్వం విడుదల చేయలేదు. పెండింగ్‌లో ఉన్న చెక్కులు, నిధులను విడుదలచేసి కార్యదర్శులపై ఒత్తిడి తగ్గించాలని వారు వేడుకుంటున్నారు.
జగదేవ్‌పూర్ ఎంపీడీఓకు వినతిపత్రం అందజేస్తున్న కార్యదర్శులు
నేరుగా చెల్లించే
వెసులుబాటు కల్పించండి
గ్రామ పంచాయతీ పన్ను వసూళ్లను ట్రెజరీతో సంబంధం లేకుండా చేయాలి. టీఎస్‌బీపాస్ అకౌంట్ ద్వారా నేరుగా చెల్లింపులు చేసే వేసులుబాటును ప్రభుత్వం కల్పించాలి. – రఘురామకృష్ణ,
పంచాయతీ కార్యదర్శి
డబ్బులిస్తేనే డీజిల్ అంటున్నారు..
బిల్లులు పెండింగ్‌లో ఉండడం వల్ల గ్రామ పంచా యతీ నిర్వహణకు పెట్రోల్ బంకు, ఇతర షాపు యజమానులు ఇవ్వలేమని చెప్తున్నారు. పెండింగ్‌లో ఉంచిన చెక్కులు, నిర్వహణకు నిధులను వెంటనే విడుదల చేయాలి.
– లింగంపల్లి మురళి, జిల్లా
అధ్యక్షుడు, పంచాయతీ కార్యదర్శుల ఫోరం
●

దేవుడు వరమిచ్చినా.. పూజారి కరుణించలేదన్నట్లు తయారైంది జ

దేవుడు వరమిచ్చినా.. పూజారి కరుణించలేదన్నట్లు తయారైంది జ
Comments
Please login to add a commentAdd a comment