అభివృద్ధి పనులు వేగిరం చేయండి
● కలెక్టర్ మిక్కిలినేని మనుచౌదరి ● ఈజీఎస్ కింద చేపడుతున్న పనులపై సమీక్ష
సిద్దిపేటరూరల్: ఉపాధి హామీ పథకం కింద చేపడుతున్న అన్ని రకాల అభివృద్ధి పనులను వేగిరం చేయాలని కలెక్టర్ మిక్కిలినేని మనుచౌదరి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్‌హాలులో ఉపాధి హామీ పథకంలో భాగంగా చేపట్టిన సీసీ రోడ్లు, డ్రైనేజీలు, జీపీ భవనాలు, అంగన్వాడీలు, తదితర నిర్మాణాల పురోగతిపై మండలాల వారీగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్‌తో కలిసి కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్‌ఆర్‌ఈజీఎస్ కింద చేపడుతున్న పనులు వేగంగా పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో డీఆర్డీఓ జయదేవ్ ఆర్య, పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ ఈఈ శ్రీనివాస్ రెడ్డి, డీఈలు, ఏఈలు పాల్గొన్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికలు సమర్థంగా నిర్వహించాలి
పట్టభద్రులు, ఉపాధ్యాయ శాసనమండలి ఎన్నికలను అధికారులు సమర్థంగా నిర్వహించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈనెల 27న ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ నిర్వహణపై పీఓ, ఏపీఓలతో కలెక్టరేట్‌లోని మీటింగ్ హాల్‌లో శిక్షణ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల మార్గదర్శకాలకు అనుగుణంగా చేపట్టాలన్నారు. ఓటు వేసే విధానంపై పోలింగ్ కేంద్రం వద్ద ఫ్లెక్సీని ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్, మాస్టర్ ట్రైనర్, ఎన్నికల పీఓలు, ఏపీఓలు తదితరులు పాల్గొన్నారు.
అటవీ భూమిని సంరక్షించాలి
గజ్వేల్, మైలారం గ్రామంలోని 28 హెక్టార్ల అటవీ ప్రాంతాన్ని రక్షించాలని కలెక్టర్ మనుచౌదరి అధికారులను ఆదేశించారు. ఇప్పటివరకు ఫారెస్ట్ రైడ్ యాక్ట్‌లో ఎలాంటి కేసులు నమోదు కాలేదన్నారు. అటవీ భూమి ఉన్న ప్రాంతాన్ని మొత్తం సంరక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. కొత్త ప్లాంటేషన్, పాత మొక్కలను సంరక్షించేందుకు చర్యలు చేపట్టాలని, ఇది అందరి బాధ్యత అన్నారు. అటవీ అభివృద్ధిలో స్వచ్ఛంద సంస్థల బాధ్యత అన్నారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ అబ్దుల్ హమీద్, అటవీ శాఖ అధికారి, జోజి, ట్రైబల్ వెల్ఫేర్ అధికారి అఖిలేష్‌రెడ్డి, ఏడి సర్వే ల్యాండ్ వినయ్ కుమార్, తదితర అధికారులు పాల్గొన్నారు.
బయోమెట్రిక్ విధానాన్ని పరిశీలిస్తున్న
కలెక్టర్ మిక్కిలినేని మనుచౌదరి
కలెక్టరేట్‌లో బయోమెట్రిక్
కలెక్టరేట్‌లో విధులు నిర్వహించే అధికారులు, సిబ్బంది హాజరు వివరాలు నమోదు చేసేందుకు బయోమెట్రిక్ విదానాన్ని అమలులోకి తెస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. బయోమెట్రిక్ యంత్రాల ఏర్పాటు పనులను సోమవారం కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అధికారులు, సిబ్బంది హాజరు నమోదు ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు పనులు త్వరగా పూర్తి చేయాలని ఈడీఎం ఆనంద్‌ను కలెక్టర్ ఆదేశించారు.
అభివృద్ధి పనులు వేగిరం చేయండి
Comments
Please login to add a commentAdd a comment