మున్సిపల్ కమిషనర్ ఆశ్రిత్ కుమార్
సిద్దిపేటజోన్: ప్రజల భాగస్వామ్యంతో ‘స్వచ్ఛ’ సిద్దిపేట దిశగా సాగుదామని మున్సిపల్ కమిషనర్ ఆశ్రిత్ కుమార్ పిలుపునిచ్చారు. మంగళవారం స్థానిక విపంచి ఆడిటోరియంలో మున్సిపల్ అధికారులు, సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, మెప్మా విభాగం, స్వయం సహాయక సంఘాల ప్రతినిధులతో స్వచ్ఛ సర్వేక్షన్ పై సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ప్రతి ఏటా కేంద్రం నిర్వహించే స్వచ్ఛ సర్వేక్షన్ పోటీల్లో పట్టణ ప్రజల మద్దతు ద్వారా అనేక జాతీయ స్థాయిలో అవార్డులు పొందామన్నారు. ఈసారి మళ్ళీ ప్రజల అభిప్రాయాలను సేకరించి సిటిజన్ ఫీడ్ బ్యాక్ అంశంపై మెరుగైన ఫలితాలు సాధించాలని, అందుకు ప్రజల సహకారం అవసరమని అన్నారు. పట్టణ ప్రజలు సిటిజన్ ఫీడ్ బ్యాక్‌లో పాల్గొనాలని, అందుకు సిబ్బంది వారిని చైతన్యం చేయాలని సూచించారు. సిటిజన్ ఫీడ్ బ్యాక్ ప్రక్రియలో భాగంగా క్యూఆర్ కోడ్ ద్వారా లేదా సిబ్బందికి ప్రజాభిప్రాయ అందించి సర్వేలో పాల్గొనాలని సూచించారు.10 రకాల ప్రశ్నలకు ప్రజలు సమాధానం ఇవ్వాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన పలు అంశాలపై అవగాహన కల్పించారు.
Comments
Please login to add a commentAdd a comment