మర్కూక్(గజ్వేల్): క్రీడాకారులు ప్రతిభను కనబరిచి రాణించాలని నాయకులు కోరారు. మండలంలోని దామరకుంటలో పదిరోజులుగా అండర్ 16 కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నారు. మంగళవారం ఏకలవ్య కబడ్డీ అసోసియేషన్ జట్టుకు క్రీడా దుస్తులు, భోజన ఖర్చులకు నగదు అందజేశారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ పాండుగౌడ్, మాజీ జెడ్పీటీసీ మంగమ్మ రాంచంద్రం మాట్లాడారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు కరుణాకర్‌రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ బాల్‌రెడ్డి, మండల జెడ్పీటీసీల ఫోరం మాజీ అధ్యక్షుడు కృష్ణయాదవ్, దామరకుంట మాజీ సర్పంచ్ గాయత్రి, మాజీ ఉప సర్పంచ్ ఆంజనేయులు యాదవ్, కబడ్డీ కోచ్ నరేందర్, క్రీడాకారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment