మల్లన్న ఐదో వారం ఆదాయం రూ.48 లక్షలు
కొమురవెల్లి(సిద్దిపేట): మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలలో ఐదోవారం రూ. 48,10,683 వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. స్వామివారికి వివిధ రకాల మొక్కు లు, దర్శనాలు, లడ్డూ ప్రసాదాలు, పట్నాలు, బోనాల టికెట్ల అమ్మకాల ద్వారా ఈ ఆదా యం సమకూరినట్లు తెలిపారు. గత ఏడాది ఐదోవారం రూ.56,03,330 సమకూరింది. ఈసారి రూ.7,92,647 తక్కువగా వచ్చినట్లు ఈఓ రామాంజనేయులు తెలిపారు.
ఫార్మా రంగంలో
ఉపాధి అవకాశాలు
సిద్దిపేటఎడ్యుకేషన్: ప్రభుత్వ డిగ్రీ, పీజీ అటానమస్ కళాశాలలో కెమిస్ట్రీ విభాగం ఆధ్వర్యంలో మంగళవారం ఫార్మా రంగంలోని ఉపాధి అవకాశాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమానికి హైదరాబాద్‌కు చెందిన ఎంఎస్‌ఎన్ ఫార్మా కంపెనీ హెచ్‌ఆర్ విభాగాధిపతి డాక్టర్ శరత్ హాజరై మాట్లాడారు. విద్యార్థులు కెమిస్ట్రీని ఇష్టంగా చదివి పట్టు సాధించి ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకోవాలని సూచించారు. ఫార్మారంగంలోని వివిధ విభాగాల్లోని ఉద్యోగ అవకాశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. అనంతరం పలు ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. కార్యక్రమంలో కళాశాల ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ డాక్టర్ సంపత్‌కుమార్‌రెడ్డి, పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ గోపాలసుదర్శనం, కెమిస్ట్రీ అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.
కళాశాలలో
అడ్మిషన్ల సంఖ్య పెంచాలి
గజ్వేల్‌రూరల్: ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అడ్మిషన్ల సంఖ్య పెంచేందుకు అధ్యాపక బృందం కృషి చేయాలని సీపీడీసీ సభ్యులు సూచించారు. పట్టణంలోని బాలుర ఎడ్యుకేషన్ హబ్‌లోగల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మంగళవారం ప్రిన్సిపాల్ అధ్యక్షతన కళాశాల ప్రణాళిక అభివృద్ధి కార్యవర్గం(సీపీడీసీ) సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కళాశాలలో అవసరమైన మౌలిక వసతులు, సౌకర్యాలను కల్పించేందుకు సహకరిస్తామన్నారు. ఉత్తమ ఫలితాలను సాధించడంతో పాటు అడ్మిషన్ల సంఖ్య పెంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం 2024–25 విద్యాసంవత్సరానికి సంబంధించిన కళాశాల బ్రోచర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ ఎన్‌సీ రాజమౌళి, సీపీడీసీ సభ్యులు డాక్టర్ ఆకుల నరేష్‌బాబు, లక్ష్మణ్, గోపాల్‌రెడ్డి, శ్రీధర్, అధ్యాపకులు పాల్గొన్నారు.
కాస్మోటిక్ చార్జీలు
విడుదల చేయండి
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): వసతిగృహాల్లోని విద్యార్థులకు మూడేళ్లుగా కాస్మోటిక్ చార్జీలు రావడం లేదని, వెంటనే విడుదల చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షుడు కొండం సంజీవ్‌కుమార్ డిమాండ్ చేశారు. మంగళవారం జిల్లా కేంద్రంలో బీసీ హాస్టల్‌ను సందర్శించారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు క్రీడా సామగ్రిని సైతం సమకూర్చాలన్నారు. వసతిగృహాంలో దోమల బెడద ఎక్కువ ఉందని నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు.
భద్రతాభావం పెంచేందుకే కార్డెన్ సెర్చ్: ఏసీపీ మధు
చిన్నకోడూరు(సిద్దిపేట): ప్రజల రక్షణకు సంబంధించి భద్రతాభావం పెంచేందుకే కార్డెన్ సెర్చ్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సిద్దిపేట ఏసీపీ మధు తెలిపారు. మండల పరిధిలోరి ఇబ్రహీంనగర్‌లో మంగళవారం సాయంత్రం కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనుమానాస్పద ప్రాంతాల్లో నార్కోటిక్స్ డాగ్స్ తనిఖీలు నిర్వహించామన్నారు. గంజాయి, డ్రగ్స్ ఇతర మత్తు పదార్థాల పట్ల, అలాగే సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. రోడ్డు ప్రమాదాల నిరవాణకు ప్రతి ఒక్కరూ రోడ్డు నిబంధనలు పాటించాలన్నారు. కార్యక్రమంలో రూర ల్ సీఐ శ్రీను, ఎస్‌ఐ బాలకృష్ణ, సిబ్బంది తదితరులు ఉన్నారు. ఎలాంటి ధ్రువపత్రాలు లేని 32 ద్విచక్ర వాహనాలు, ఒక ఆటో సీజ్ చేశారు. 16 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నారు.
మల్లన్న ఐదో వారం ఆదాయం రూ.48 లక్షలు
Comments
Please login to add a commentAdd a comment