భోజనంలో మెనూ తప్పనిసరి
● పాటించకపోతే చర్యలు తప్పవు ● కలెక్టర్ మిక్కిలినేని మనుచౌదరి ● కలెక్టరేట్‌లో అధికారులతో సమావేశం
సిద్దిపేటరూరల్: గురుకుల, సంక్షేమ వసతి గృహాల్లో మెనూ ప్రకారం విద్యార్థుఽలకు ఆహారం అందించాలని, పాటించాలని అధికారులను సస్సెండ్ చేస్తానని కలెక్టర్ మిక్కిలినేని మనుచౌదరి అధికారులను హెచ్చరించారు. బుధవారం కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్‌తో కలిసి ఎస్సీ, ఎస్టీ, బీసి, మైనార్టీ సంక్షేమ శాఖల అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు ఆరోగ్యవంతంగా ఎదిగేందుకు మెనూను అమలు చేయాలన్నారు. నాణ్యమైన సరుకులు సరాఫరా చేయని వారిని సైతం తొలగిస్తామన్నారు. ఆకుకూరలు, క్యారెట్ ఆహారంలో అధికంగా ఉండేలా చూడాలన్నారు. స్నాక్స్ మెనూ ప్రకారం పండ్లను అందించాలన్నారు. ప్రతీ గురుకులంలో ఆర్‌డీసీఓలు, డీసీఓలు రాత్రి వేళ నిద్ర చేయాలని ఆదేశించారు. పదో తరగతి విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించి వందశాతం ఉత్తీర్ణత సాధించేలా కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో డీఈఓ శ్రీనివాస్‌రెడ్డి, డీఆర్‌ఓ, ఇంచార్జీ బీసీ అభివృద్ది అధికారి నాగరాజమ్మ, తదితరులు పాల్గొన్నారు.
ప్రత్యేక ప్రణాళికతో బడ్జెట్‌ను రూపొందించండి
వచ్చే ఆర్థిక సంవత్సరానికి అన్ని మున్సిపాలిటీల్లో ప్రత్యేక ప్రణాళికతో బడ్జెట్‌ను రూపొందించాలని కలెక్టర్ మనుచౌదరి అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాలులో కమిషనర్లు, మెప్మా, మున్సిపల్ ఇంజనీర్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ముఖ్యంగా మున్సిపల్ ఆదాయ వనరులైన ఇన్‌కంట్యాక్స్, ప్రాపర్టీ ట్యాక్స్, ఇతరత్రా గ్రాంట్‌లను అన్ని దృష్టిలో పెట్టుకోవాలన్నారు. వచ్చిన ఆదాయం లో మున్సిపల్ సిబ్బంది జీతాలు, ఎలక్ట్రిసిటీ బిల్, వాటర్ సప్లయ్, శానిటేషన్ పనులతో పాటు తప్పనిసరిగా బడ్జెట్ లో 10శాతం గ్రీన్ బడ్జెట్ కోసం పెట్టాలన్నారు. మున్సిపాలిటీలలో పన్ను వసూళ్లను మార్చి 15వరకు పూర్తి చేయాలని ఆదేశించారు. మున్సిపాలిటీలలో అక్రమంగా నిర్మించిన కట్టడాలపై దృష్టి సారించాలని, అన్ని వివరాలు పరిశీలన చేసి నిజనిర్ధారణ జరిగితే కూల్చివేత సైతం జరపాలని ఆదేశించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్లు ఆశ్రిత్ కుమార్, మల్లికార్జున్, నర్సయ్య, శ్రీనివాస్ రెడ్డి, నాగేందర్, పబ్లిసిటీ హెల్త్ డీఈలు మహేష్, ప్రేరణ, మెప్మ పీడీ హన్మంతు రెడ్డి, ఏఈ, అర్‌ఐ లు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment